పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 22
వరంగల్ : గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వరంగల్ ఎల్లమ్మ బజార్‌లో అత్యంత వైభవంగా ఏర్పాటు చేసిన 51 అడుగుల భారీ మట్టి వినాయక మండపాన్ని హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి సందర్శించారు. ఉత్సవ నిర్వాహకులు సంజీవ్ ప్రత్యేక ఆహ్వానం మేరకు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణను చాటేలా ఇంతటి భారీ మట్టి వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి, ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. లంబోదరుని కృపాకటాక్షాలతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ఆకాంక్షించారు.




