Tuesday, September 22, 2026
Home Politics స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలోకి కొనసాగుతున్న చేరికలు…-కాంగ్రెస్ పార్టీలో చేరిన రఘునాథపల్లి మండలం మేకలగట్టు,...

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలోకి కొనసాగుతున్న చేరికలు…-కాంగ్రెస్ పార్టీలో చేరిన రఘునాథపల్లి మండలం మేకలగట్టు, గోవర్ధనగిరి సర్పంచులు…..

0
7

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 21

స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే కడియం శ్రీహరి  కార్యాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు లింగాల జగదీష్ రెడ్డి, రఘునాథపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాదె మహేందర్ రెడ్డి ల ఆధ్వర్యంలో రఘునాథపల్లి మండలం మేకలగట్టు గ్రామ సర్పంచ్ ఇల్లందుల రవి, వార్డు మెంబర్లతో పాటు మరో 50మంది నాయకులు, కార్యకర్తలు మరియు గోవర్ధనగిరి గ్రామ సర్పంచ్ తోటకూర సదానందం, వార్డు మెంబర్లు ఉల్లి ఉపేంద్ర కుమారస్వామి, గొడుగు లావణ్య రాజు, వల్లెపు రాజు రజిత, నాయకులు మునిగాల మల్లేశం, వల్లెపు కుమార్, యూత్ నాయకులు జినుకుల సతీష్ తో పాటు మరో 30మంది నాయకులు, కార్యకర్తలు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షతులై కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జరుగుతున్నాయని అన్నారు. అందరం కలిసి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ప్రతీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడంతో పాటు కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్దామని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అత్యధిక నిధులతో నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు లింగాల జగదీష్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.