Monday, September 21, 2026
Home Politics జనాభా లెక్కల సేకరణ సందర్భంగా కులగణన కచ్చితంగా చేపట్టాలి: ఎంపీ రవిచంద్ర డిమాండ్…

జనాభా లెక్కల సేకరణ సందర్భంగా కులగణన కచ్చితంగా చేపట్టాలి: ఎంపీ రవిచంద్ర డిమాండ్…

0
5

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 21

కులగణన,బీసీల న్యాయమైన హక్కుల కోసం బీఆర్ఎస్ పార్లమెంటులో పోరాడుతుంది: ఎంపీ వద్దిరాజు*
దేశ జనాభాలో అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీలు,బహుజనులు అనాదిగా అన్ని రంగాలలో తీవ్ర అణచివేతకు గురవుతున్నారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ఆవేదన వ్యక్తంచేశారు.జనగణన సందర్భంగా కులగణన కూడా చేపడతామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించినప్పటికీ, ఆచరణలో మాత్రం ఎటువంటి పురోగతికి నోచుకోకపోవడం శోచనీయమన్నారు.జనాభా లెక్కలతో పాటుగా కులగణన కూడా చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీసీ ఇంటెలెక్చవల్ ఫోరం,బీసీ పొలిటికల్ ఫోరంల ఆధ్వర్యాన సోమవారం అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ వద్ద వందలాది మంది ఆందోళనకు దిగారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ,బీసీలు,బహుజనుల పట్ల అటు కేంద్రంలో,ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అవలంభిస్తున్న వైఖరిని నిశితంగా విమర్శించారు.దేశంలో బీసీలు 60 శాతానికి పైగా ఉన్నారని,ఎస్సీ, ఎస్టీ,ఆదివాసీలు, మైనారిటీలతో కలిపితే బహుజనులు 85-90 శాతంగా ఉన్నారని చెప్పారు.అయితే, జనాభాలో అత్యధిక సంఖ్యలో ఉన్న బహుజనుల ఓట్లపై ఉన్న శ్రద్ధ రాజ్యాధికారంలో వాళ్లకు సముచిత స్థానం కల్పించడంలో చూపడం లేదని కాంగ్రెస్, బీజేపీలపై ఎంపీ రవిచంద్ర మండిపడ్డారు.ప్రధాని నరేంద్రమోడీ బీసీ అయి ఉండి కూడా బీసీల న్యాయమైన హక్కులను పరిరక్షించడంలో,పరిష్కరించడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు.దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 80 ఏళ్లు దాటిన కూడా బీసీల సంక్షేమం,సముద్ధరణకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడం తీవ్ర బాధాకరం అని ఎంపీ వద్దిరాజు వ్యాఖ్యానించారు.బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో,విద్యా,ఉద్యోగ రంగాలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న,ఏటా బడ్జెట్లో 20వేల కోట్ల చొప్పున కేటాయిస్తామంటూ ఇచ్చిన హామీలను పాలకులు విస్మరించడం విచారకరమన్నారు.చేతిలో రాజ్యాంగ ప్రతిని పట్టుకుతిరిగే రాహుల్ గాంధీ బీసీ రిజర్వేషన్ల పెంపుదల గురించి కనీసం ఆలోచించడం లేదని ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు.బీసీ రిజర్వేషన్లు పెంచాలంటూ పార్లమెంటులో తాను ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుకు కాంగ్రెస్ నాయకత్వాన ఉన్న ఇండియా కూటమి మద్దతివ్వలేదని, అధికారంలో ఉన్న బీజేపీ పట్టించుకోవడం లేదని ఎంపీ రవిచంద్ర ఆవేదన వెలిబుచ్చారు.కులగణన చేపడితే బీసీలు,బహుజనుల జనాభా లెక్కలు,80 ఏళ్లుగా వారికి జరుగుతున్న అన్యాయాలు,వాస్తవాలు బయటపడతాయని పాలకులు భయపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.జనాభా లెక్కల సేకరణ సందర్భంగా కులగణన చేపట్టేందుకు గాను ప్రత్యేక క్యూఆర్ కోడ్,కాలమ్ పొందుపర్చాలని,బీసీలకు కేంద్రంలో ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న న్యాయమైన డిమాండ్ల సాధనకు తమ పార్టీ బీఆర్ఎస్ పార్లమెంట్ లోపల,బయట తన పోరాటాన్ని కొనసాగిస్తుందని ఎంపీ వద్దిరాజు చెప్పారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి,ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవులు, పొలిటికల్ ఫోరం చైర్మన్ బాలరాజ్ గౌడ్,సర్పంచుల సంఘం అధ్యక్షుడు యాదయ్య గౌడ్ తదితర ప్రముఖులతో పాటు వందలాది బీసీలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.