కామారెడ్డి జిల్లా పరివర్తన ఆవాజ్ : పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత! వనమహోత్సవంలో స్వయంగా మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ శ్రీ యం రాజేష్ చంద్ర, IPS తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో నిర్వహించిన ప్రత్యేక వనమహోత్సవ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ యం రాజేష్ చంద్ర, IPS స్వయంగా మొక్కలు నాటి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతో పాటు పచ్చదనం పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్లో మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని సూచించారు. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించవచ్చని తెలిపారు. మొక్క నాటడం మాత్రమే కాదు.. దానిని సంరక్షించడం కూడా మన బాధ్యత” అని ఎస్పీ గారు పేర్కొన్నారు. వనమహోత్సవాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రజలు, యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున మొక్కలు నాటి, వాటి సంరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేస్తే పచ్చని కామారెడ్డిని నిర్మించవచ్చని ఎస్పీ తెలిపారు. మొక్కలను సంరక్షించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడటంతో పాటు భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన జీవన వాతావరణాన్ని అందించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ కే. నర్సింహారెడ్డి, ఏఆర్ డీఎస్పీ ఉదయభాస్కర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ మధుసూదన్, ఆర్‌ఐలు సంతోష్ కుమార్, నవీన్, కృష్ణ, ఆర్‌ఎస్ఐ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






