Saturday, September 12, 2026
Home People నూతన విద్యా విధానం తోనే సమగ్ర విద్యా వికాసం: కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ...

నూతన విద్యా విధానం తోనే సమగ్ర విద్యా వికాసం: కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సెమినార్ :

0
52

📰 Generate e-Paper Clip

నూతన విద్యా విధానం తోనే సమగ్ర విద్యా వికాసం: కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సెమినార్ :

[కామారెడ్డి పరివర్తన అవాజ్]      ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి)లో ‘ది నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ఎన్ఈ పి 2020 : ఏ ట్రాన్స్‌ఫర్మేటివ్ షిఫ్ట్ ఇన్ ఇండియన్ ఎడ్యుకేషన్’ అనే అంశంపై రాజనీతి శాస్త్రంలో రెండు రోజుల జాతీయ సెమినార్ అట్టహాసంగా ప్రారంభమైంది. జ్యోతి ప్రజ్వలన, విద్యార్థినుల స్వాగత నృత్యం మరియు సెమినార్ సావనీర్ ఆవిష్కరణతో కార్యక్రమం ఘనంగా మొదలైంది.

డా. కె. విజయ్ కుమార్ ప్రిన్సిపాల్ & అధ్యక్షులు విద్యా రంగంలో వస్తున్న మార్పులు, పరిశోధనల ప్రాముఖ్యతను వివరించారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఇలాంటి సెమినార్లు విద్యార్థులకు, పరిశోధకులకు ఎంతో మేలు చేస్తాయని పేర్కొన్నారు.
డా. డి.ఎస్.ఆర్. రాజెందర్ సింగ్ (జాయింట్ డైరెక్టర్, కళాశాల విద్య) నూతన విద్యా విధానం మానవాళి అభివృద్ధికి దోహదపడుతుందని, విద్యార్థులు కొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవడం అత్యవసరమని సూచించారు.
డాక్టర్ కె. కిష్టయ్య (కన్వీనర్&వైస్ ప్రిన్సిపల్):
ఈ జాతీయ సెమినార్ ముఖ్య ఉద్దేశ్యాన్ని మరియు ఆవశ్యకతను వివరించారు. దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో వస్తున్న సమూల మార్పులను అధ్యాపకులు, పరిశోధకులు మరియు విద్యార్థులకు చేరువ చేయడమే ఈ సెమినార్ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థుల్లో సృజనాత్మకతను, పరిశోధనా దృక్పథాన్ని పెంపొందించడానికి నూతన విద్యా విధానం ఏ విధంగా ఉపయోగపడుతుందో ఈ రెండు రోజుల చర్చా వేదిక ద్వారా స్పష్టత వస్తుందని తెలిపారు.

ప్రొఫెసర్ ఎన్.నర్సింహారెడ్డి (రిటైర్డ్ ప్రొఫెసర్, ఓ.యు): మన భారతీయ విద్యా మూలాలు ప్రాంతీయ భాషల్లో ఉన్నాయని, ప్రస్తుత వ్యవస్థలో లోపిస్తున్న ఆ మూలాలను నూతన విద్యా విధానం ద్వారా తిరిగి పొందవచ్చని తెలిపారు.

ప్రొఫెసర్ యాదగిరి (రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్) నేటి యువత తక్కువ సమయంలో ఎక్కువ జ్ఞానాన్ని ఆశిస్తున్నారని, దానికి అనుగుణంగా విద్యా విధానంలో మార్పులు అవసరమని అన్నారు.

ప్రొఫెసర్ భూక్య వీరభద్రం తమిళనాడు వర్సిటీ భారతదేశం అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరాలంటే ప్రాచీన విజ్ఞానానికి కాలానుగుణ సాంకేతికతను జోడించాలని పిలుపునిచ్చారు.
ప్రొఫెసర్ డా. కృష్ణారెడ్డి కేంద్రీయ విద్యాలయం,హైదరాబాద్ ప్రాంతీయ భాషలు, సంస్కృతులతో కూడిన పాఠ్యాంశాల అవసరాన్ని నొక్కి చెప్పారు.
డా. బి. జగన్నాథం,గుజరాత్ వర్సిటీ గతంలో అనేక కమిషన్లు వచ్చినప్పటికీ, నేటి కాలానికి అనుగుణంగా ఎన్ఈపి మరింత సానుకూల మార్పులను తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
సంగి రమేష్, మహేశ్వరం, విజయ లక్ష్మి గంభీరావుపేట ప్రిన్సిపాల్, వికసిత్ భారత్-2047 లక్ష్యంలో భాగంగా యువత సాంకేతికతను అందిపుచ్చుకోవాలని,నలంద వంటి ప్రాచీన వర్సిటీల విజ్ఞానంతో పాటు ఆధునిక విధానాలను నేర్చుకోవాలని కోరారు.

మధ్యాహ్నం జరిగిన నాలుగు టెక్నికల్ సెషన్లలో వివిధ విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధక విద్యార్థులు తమ పరిశోధన పత్రాలను సమర్పించారు. అనంతరం సెమినార్‌కు విచ్చేసిన అతిథులను కళాశాల తరపున శాలువా, జ్ఞాపిక మరియు పూల మొక్కలతో ఘనంగా సత్కరించారు. ఎమ్మెస్ డబ్ల్యూ విద్యార్థి బి.స్వామి తన గాత్రంతో తెలంగాణ గీతాన్ని మంత్రముగ్ధంగా ఆలపించారు.

ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల అధ్యాపకులు, పరిశోధకులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.