Saturday, September 12, 2026
Home People జీవో నెంబర్ 3 స్థానంలో కొత్త జీవో ను తీసుకువచ్చి ఏజెన్సీ నిరుద్యోగ యువతను రాష్ట్ర...

జీవో నెంబర్ 3 స్థానంలో కొత్త జీవో ను తీసుకువచ్చి ఏజెన్సీ నిరుద్యోగ యువతను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి.

0
48

📰 Generate e-Paper Clip

జీవో నెంబర్ 3 స్థానంలో కొత్త జీవో ను తీసుకువచ్చి ఏజెన్సీ నిరుద్యోగ                           యువతను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి.

సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ ప్రభుత్వానికి డిమాండ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో పరివర్తన అవాజ్  జనవరి 29, సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ మాట్లాడుతూ రాజ్యాంగం లోని 5వ షెడ్యూల్ ప్రకారం ఏజెన్సీ ఏరియాలో ఆర్టికల్ 244(1) పార్ట్ ఏ. బి. సి. డి లను ననుసరించి నివాసాలు, నిధులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, భూముల క్రయ విక్రయాలు స్థానిక గిరిజనులకే 100% శాతం సర్వ హక్కులు ఉంటాయని రాజ్యాంగం చెపుతుంది. కానీ, జీవో నెంబర్.3 జీవోను సుప్రీంకోర్టు రద్దు చేయడం వల్ల ఏజెన్సీ ప్రాంత గిరిజన నిరుద్యోగులు ఉద్యోగాలకు దూరమవుతున్నారనీ. ఏజెన్సీ ప్రాంతాలలో 100% ఉద్యోగ అవకాశాలు గిరిజన ప్రజలకు వచ్చే విధంగా ప్రజా ప్రభుత్వం చేయాలని అన్నారు అదేవిధంగా జిల్లాలో ఉన్న భద్రాచలం ఐటీడీఏ ద్వారా ఏజెన్సీ డీఎస్సీ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు కొందరు కావాలనే ఏజెన్సీ చట్టాలను తుంగలో తొక్కుతూ చట్టాలను నీరు గార్చుతున్నారని మండిపడ్డారు 2012లో నిర్వహించిన డీఎస్సీ ఇప్పటివరకు ఐటీడీఏ నుండి ఒక్క నోటిఫికేషన్ కూడా లేకుండా చేస్తూ ఏజెన్సీ నిరుద్యోగ యువత జీవితాలతో ఆటలాడుతున్నారని అన్నారు ఇప్పటికైనా ప్రజా ప్రభుత్వం భద్రాచలం ఐ టి డి ఏ ద్వారా ఏజెన్సీ డీఎస్సీ నిర్వహించి నిరుద్యోగ యువతను ఆదుకోవాలని కోరారు ఏజెన్సీ డీఎస్సీ సమస్య ను గిరిజన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి ఏజెన్సీ డీఎస్సీ నిర్వహించేలా చేయాలని నిరుద్యోగ యువత ను ఆదుకోవాలని కోరారు

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.