Monday, September 14, 2026
Home People గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి CSR సహకారం అందించాలి

గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి CSR సహకారం అందించాలి

0
39

📰 Generate e-Paper Clip

గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి CSR సహకారం అందించాలి

                                 జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

పరివర్తన అవాజ్,కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో CSR బృంద సభ్యులు గురువారం జిల్లాలోని పలు పాఠశాలలు మరియు భవిత కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాల్వంచ మండలంలోని భవిత కేంద్రం మరియు కోయ గట్టు పాఠశాలలను పరిశీలించారు. కోయ గట్టు పాఠశాల వద్ద కౌజు పిట్టల పెంపకం ద్వారా ఒక సాధారణ వ్యక్తికి వచ్చే ఆదాయం, ఉపాధి అవకాశాలపై జిల్లా కలెక్టర్ CSR బృంద సభ్యులకు వివరించారు.అనంతరం బూర్గంపాడు మండలంలోని చెరువు సింగారం ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణానికి CSR నిధుల ద్వారా సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ బృంద సభ్యులను కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యా మౌలిక సదుపాయాల అభివృద్ధికి CSR సంస్థల సహకారం ఎంతో కీలకమని తెలిపారు.
ఈ పర్యటనలో CSR బృంద సభ్యులు కోటా లక్ష్మీనరసింహ, రఘు, సుమంత్, జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్లు SK. సైదులు, N. సతీష్ కుమార్, పాల్వంచ మండల విద్యాధికారి శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.