Saturday, September 12, 2026
Home People ప్రజావాణి లో 80 దరఖాస్తులు

ప్రజావాణి లో 80 దరఖాస్తులు

0
16

📰 Generate e-Paper Clip

              ప్రజావాణి లో 80 దరఖాస్తులు

        ప్రజావాణి లో వస్తున్న అర్జీలకు అధికారులు తక్షణమే స్పందించి       పరిష్కరించాలి: జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి పరివర్తన ఆవాజ్  నవంబర్10 :     ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం లో భాగంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఆర్జీదారుల నుండి అర్జీలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్లు విక్టర్, మదన్ మోహన్ , డిప్యూటి కలెక్టర్ రవితేజ, ఆర్డీఓ లు కామారెడ్డి వీణ, , ఎల్లారెడ్డి పార్థసారథి రెడ్డి లతో కలిసి అర్జీలను స్వీకరించారు.జిల్లాలోని వివిధ మండలాల నుండి వచ్చిన ప్రజలు తమ వినతులు, ఫిర్యాదులు అధికారులకు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అర్జీదారుల సమస్యలను ఓపిగ్గా వింటూ సంబంధిత ఆయా శాఖ జిల్లా ఆధికారులకు అర్జీలను ఇస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారుజిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు సమర్పించిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, పరిధిలో పరిష్కరించగలిగిన వాటిని వెంటనే పరిష్కరించాలని, పరిధికి సంబంధించినవి కాని అంశాల పై దరఖాస్తుదారులకు సరైన సూచనలు అందించాలని తెలిపారు.అలాగేప్రజావాణి పెండింగ్ లో ఉన్న ఆయా జిల్లా అధికారులు త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.ప్రజావాణి లో మొత్తం 80 దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని తెలిపారు.ప్రజావాణి లో ఆయా జిల్లా అధికారులు, రెవెన్యు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.