Sunday, November 29, 2026
Home People కామారెడ్డిలో ఘనంగా దీక్షా దివస్ కార్యక్రమం

కామారెడ్డిలో ఘనంగా దీక్షా దివస్ కార్యక్రమం

0
5

📰 Generate e-Paper Clip

కామారెడ్డి పరివర్తన అవాజ్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఈఎస్ఆర్ గార్డెన్‌లో దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను స్మరించుకుంటూ మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా గంప గోవర్ధన్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ చరిత్రలో దీక్షా దివస్ ఒక సువర్ణ అధ్యాయమని పేర్కొన్నారు. కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష యావత్ తెలంగాణ సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చి ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమానికి కీలక మలుపుగా నిలిచిందని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ చేసిన పోరాటం మరువలేనిదని, ఆయన పదేళ్ల పాలనలో వ్యవసాయం, సాగునీరు, విద్యుత్, విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి సాధించిందని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుతో కామారెడ్డి జిల్లాను సాధించుకోవడంతో పాటు మెడికల్ కళాశాల, నూతన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటయ్యాయని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, రైతు వేదికలు, ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, విద్యుత్ సబ్‌స్టేషన్లు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వివరించారు.ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని గంప గోవర్ధన్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం తిరిగి అభివృద్ధి పథంలో పయనించాలంటే కేసీఆర్ నాయకత్వం అవసరమని, బీఆర్ఎస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.