వరంగల్ జిల్లా పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక నవంబర్ 27
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు.శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎల్ కిషోర్ కుమార్, సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, ఆర్ అండ్ బి ఇ ఇ రాజేందర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా తెలంగాణ రోడ్డు భద్రత (నాన్ లాప్సబుల్) నిధి నుంచి వరంగల్ జిల్లాకు రూ.1 కోటి కేటాయించినట్లు తెలిపారు. ఈ నిధులను రోడ్డు భద్రతకు సంబంధించిన నిర్దేశిత కార్యక్రమాలకే వినియోగించాలని సూచించారు.మొదటి ప్రాధాన్యతగా ట్రాఫిక్ పోలీసులకు అవసరమైన బ్రీత్ అనలైజర్లు, స్పీడ్ గన్స్, బాడీ వోర్న్ కెమెరాలు తదితర ఎన్‌ఫోర్స్‌మెంట్ పరికరాలను సమకూర్చాలని తెలిపారు.అలాగే జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని, జంక్షన్ల అభివృద్ధి, పాదచారుల సౌకర్యాలు, రోడ్డు సూచిక బోర్డులు, రోడ్డు మార్కింగ్స్ వంటి ఇంజనీరింగ్ సంబంధిత పనులను సాంకేతిక నిపుణుల సలహాల మేరకు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థల్లో రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు దాటే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగంపై అవగాహన కల్పించాలని సూచించారు.జిల్లా రోడ్డు భద్రత కమిటీ ప్రతి నెల సమావేశమై రోడ్డు ప్రమాదాల పరిస్థితి, చేపట్టిన చర్యలు, వాటి పురోగతిని సమీక్షించాలని తెలిపారు. జిల్లా రోడ్డు భద్రత ప్రణాళిక రూపొందించి, సంబంధిత నివేదికలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు.రోడ్డు భద్రత నిధుల వినియోగానికి సంబంధించి ప్రతి ఖర్చును జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో ఆమోదం పొందిన తర్వాతే చేపట్టాలని, నిధుల వినియోగంలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులకు సూచించారు.ఈ సమావేశంలో ఆర్డీవో నర్సంపేట ఉమారాణి, GWMC ఇంజనీఇంగ్ అధికారులు ఎస్ ఇ రాజకుమార్,సిటీ రవీందర్ రెడేకర్, జిల్లా పోహిబిషన్ అధికారి ,
సంబంధిత శాఖల అధికారులు, జిల్లా రోడ్డు భద్రత కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




