కామారెడ్డిలో ఘనంగా దీక్షా దివస్ కార్యక్రమం
కామారెడ్డి పరివర్తన అవాజ్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఈఎస్ఆర్ గార్డెన్లో దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను స్మరించుకుంటూ మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా గంప గోవర్ధన్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ చరిత్రలో దీక్షా దివస్ ఒక సువర్ణ అధ్యాయమని పేర్కొన్నారు. కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష యావత్ తెలంగాణ సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చి ప్రత్యేక రాష్ట్ర సాధన...