దీక్షా దివస్ కార్యక్రమం సందర్భంగా ఇతర పార్టీలకు చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరడం కామారెడ్డి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
కామారెడ్డి పరివర్తన అవాజ్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ESR గార్డెన్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ ప్రభుత్వ విప్, గంప గోవర్ధన్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ప్రాణాలకు తెగించి అమర నిరాహార దీక్ష చేపట్టడం వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సాగునీరు, కరెంటు అందించడంలో విఫలమైందని, మహిళలకు పెన్షన్లు పెంచుతామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించలేదని విమర్శించారు. రానున్న రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.ఇదిలా ఉండగా, మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పరికె ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో బీబీపేట మండలానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు సుమారు 70 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు.బీబీపేట మండల మాజీ కో-ఆప్షన్ సభ్యుడు, ప్రస్తుత 10వ వార్డు సభ్యుడు మొహమ్మద్ ఆసిఫ్, 13వ వార్డు సభ్యుడు రేవతి రాము, 14వ వార్డు సభ్యుడు శిరీష భాస్కర్, బీజేపీ మాజీ గ్రామ అధ్యక్షుడు సురేష్తో పాటు పలువురు నాయకులు బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పరికె ప్రేమ్ కుమార్, సర్పంచులు, గ్రామ అధ్యక్షులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





