Friday, October 23, 2026
Home Politics State తెలంగాణ ఆడబిడ్డలందరికి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు:ఎంపీ రవిచంద్ర….

తెలంగాణ ఆడబిడ్డలందరికి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు:ఎంపీ రవిచంద్ర….

0
18

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 17

సద్దుల బతుకమ్మ పర్వదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తెలంగాణ ఆడబిడ్డలందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన ఈ పండుగ సందర్భంగా ఆడబిడ్డలు ప్రకృతిని,పువ్వులను, గౌరమ్మను ఆరాధిస్తారని, బంధుమిత్రులతో కలిసి ఇష్టంగా, ఉత్సాహంగా, సంతోషంగా జరుపుకుంటారన్నారు.ఈ పండుగ చివరి రోజు తొమ్మిదవ రోజున ఆడబిడ్డలు తంగేడు,గునుగు,గుమ్మడి, బంతి,చామంతి తదితర తీరొక్క పూలతో ఆడబిడ్డలు బతుకమ్మలను ఆకర్షణీయంగా పేర్చి పిల్లాపాపలతో కలిసి ఆడిపాడుతారన్నారు.అనాదిగా ఎంతో విశిష్టత కలిగిన ఈ పండుగ తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలకు అద్దం పడుతుందని ఎంపీ రవిచంద్ర తన సందేశంలో పేర్కొన్నారు.మహానేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు నాయకత్వాన ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమం సందర్భంగా బతుకమ్మ పండుగ ప్రజలను మరింత ఐకమత్యంతో ముందుకు నడిపించిందని ఆయన చెప్పారు.కేసీఆర్ పాలనలో ఈ పండుగను అధికారికంగా జరిపించారని,మరింత ప్రాచుర్యం తీసుకువచ్చారని.. ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు లభించడంతో ప్రఖ్యాత “ఆక్స్ ఫర్డ్”డిక్షనరీలో “బతుకమ్మ”పదం చేర్చబడిందని ఎంపీ రవిచంద్ర వివరించారు.ఈ విశిష్టమైన పండుగ సందర్భంగా రాష్ట్రంలోని లోని మహిళామణులు, దేశవిదేశాల్లో స్థిరపడిన, నివసిస్తున్న తెలంగాణ ఆడబిడ్డలందరికి ఎంపీ వద్దిరాజు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.