తెలంగాణ ఆడబిడ్డలందరికి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు:ఎంపీ రవిచంద్ర….
పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 17 సద్దుల బతుకమ్మ పర్వదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తెలంగాణ ఆడబిడ్డలందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన ఈ పండుగ సందర్భంగా ఆడబిడ్డలు ప్రకృతిని,పువ్వులను, గౌరమ్మను ఆరాధిస్తారని, బంధుమిత్రులతో కలిసి ఇష్టంగా, ఉత్సాహంగా, సంతోషంగా జరుపుకుంటారన్నారు.ఈ పండుగ చివరి రోజు తొమ్మిదవ రోజున ఆడబిడ్డలు తంగేడు,గునుగు,గుమ్మడి, బంతి,చామంతి తదితర తీరొక్క పూలతో ఆడబిడ్డలు బతుకమ్మలను ఆకర్షణీయంగా పేర్చి పిల్లాపాపలతో కలిసి ఆడిపాడుతారన్నారు.అనాదిగా ఎంతో విశిష్టత కలిగిన ఈ...