హన్మకొండ పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 03
వయోవృద్ధులు గతాన్ని తలచుకుని బాధపడకుండా, ఎలాంటి ఉద్రేకాలకు లోనుకాకుండా ప్రశాంతంగా వర్తమానాన్ని ఆనందంగా గడపాలని జిల్లా కలెక్టర్ మరియు అతిధులు అన్నారు. కుటుంబంలో, సమాజంలో ఓర్పుతో సర్దుబాటు అవుతూ తమ విలువైన అనుభవాలను భావితరాలకు అందించాలని కోరారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ కార్యక్రమం లో భాగంగా హన్మకొండ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమ శాఖ , గ్రామీణభివృద్ది శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వేడుకలకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ ఆరోగ్యవంత మైన, విలువలతో కూడిన సమాజ నిర్మాణంలో వయోవృద్ధుల అనుభవాలు ఎంతో కీలకమన్నారు.వయోవృద్ధుల అనుభవాలను పిల్లలతో పంచుకోవడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరిగి, భయం లేకుండా వేదికలపై మాట్లాడే సామర్థ్యం, ఆసక్తి పెరుగుతున్నాయని తెలిపారు. వయోవృద్ధులు కృంగిపోకుండా ప్రశాంతమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని, గతాన్ని గుర్తుచేసుకుని బాధపడకుండా ప్రస్తుతాన్ని సంతోషంగా ఆస్వాదించాలని సూచించారు. వయోవృద్ధులను గౌరవిస్తూ, వారి హక్కులను కాపాడుతామని, వారికి ప్రేమ పూర్వక రక్షణ కల్పిస్తామని అందరిచేత కలెక్టర్ ప్రతిఙ్ఙ చేయించారు, వయోవృద్ధులను సన్మానించడం జరిగింది.వయోవృద్ధుల చట్టం మరియు ట్రిబ్యునల్ కోర్టు పైన గెస్ట్ లెక్చర్ ను సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ కోర్టు మెంబర్ డాక్టర్ అనితా రెడ్డి అవగాహన కల్పించారు,వృద్ధులకు ఏ సమస్యలు వచ్చినా ట్రిబ్యునల్ కోర్టు ను సంప్రదించాలని తన నెంబర్ 9177362072 సైతం సంప్రదించవచ్చని డాక్టర్ అనితా రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శేషాద్రి అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్), జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అప్పయ్య, పీడీ డీఆర్డీఏ శ్రీనివాస్, సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ కోర్టు మెంబర్ డాక్టర్ అనితా రెడ్డి, డి డబ్ల్యు. ఓ విశ్వజ జిల్లా వయోవృద్ధుల కమిటీ ప్రెసిడెంట్ చంద్రమౌళి, నర్సయ్య, కమిటీల, ప్రవీణ్, వివిధ సంస్థల సభ్యులు, సభ్యులు, రవికిరణ్, సిందు, కళ్యాణి, సీడీపీఓలు, సూపర్‌వైజర్లు, జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది, వయోవృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




