వయోవృద్ధులు ఆనందంగా గడపాలి…. -వయోవృద్ధుల అనుభవాలను భావితరాలకు అందించాలి – హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్…
హన్మకొండ పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 03 వయోవృద్ధులు గతాన్ని తలచుకుని బాధపడకుండా, ఎలాంటి ఉద్రేకాలకు లోనుకాకుండా ప్రశాంతంగా వర్తమానాన్ని ఆనందంగా గడపాలని జిల్లా కలెక్టర్ మరియు అతిధులు అన్నారు. కుటుంబంలో, సమాజంలో ఓర్పుతో సర్దుబాటు అవుతూ తమ విలువైన అనుభవాలను భావితరాలకు అందించాలని కోరారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ కార్యక్రమం లో భాగంగా హన్మకొండ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమ శాఖ , గ్రామీణభివృద్ది శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వేడుకలకు...