తల సేమియా చిన్నారుల ప్రాణాలను కాపాడడం కోసం కదిలిన జిల్లా పోలీసు శాఖ
జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర & జిల్లా పోలీస్ శాఖకు కృతజ్ఞతలు తెలియజేసిన తల సేమియా సొసైటీ
పరివర్తన ఆవాజ్ కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలో పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం జిల్లా చరిత్రలో మొట్టమొదటిసారిగా 435 యూనిట్ల రక్తాన్ని సేకరించినందుకుగాను కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తల సేమియా సికిల్ సెల్ పురస్కారాన్ని అందజేయడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయ సభ్యులు డాక్టర్ బాలు,కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు ఎండి జమీల్ అమ్మద్ లు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ 2007 నుండి రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరిగిందని, ఇప్పటివరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎప్పుడూ కూడా 435 యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరగలేదని ఈ రోజు చరిత్రలో కనివిని ఎరుగని విధంగా కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సహకారం మరియు జిల్లా పోలీసు శాఖ యంత్రాంగం సహకారంతో తల సేమియా బాధిత చిన్నారుల కోసం,ప్రభుత్వ వైద్యశాలలో పేషంట్ల కోసం రక్తాన్ని సేకరించడం వారి కుటుంబాలకు ఎంతగానో తోడ్పడుతుందని,రక్తం దొరకక ఎంతోమంది తలసేమియా చిన్నారులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని వారి ప్రాణాలను కాపాడడం కోసం ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెల్మెట్స్ ను అందజేసిన దాతలకు కృతజ్ఞతలను తెలియజేశారు.హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ వారి సహకారంతో రక్తదాతలకు పండ్లను పంపిణీ చేయడం జరిగిందని ఈ శిబిరానికి సహకరించిన కామారెడ్డి జిల్లా రక్తదాతలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.




