పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 7 అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్ మరియు కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు డాక్టర్ అనితా రెడ్డి ఆధ్వర్యంలో హన్మకొండ సర్కూట్ గెస్ట్ హౌస్ దగ్గరలోని స్పందన మానసిక దివ్యాంగుల ఆశ్రమంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరిగింది, పిల్లలు ఆశ్రమ సిబ్బంది బతుకమ్మ పేర్చి ఆట పాటలతో అలరించారు, ముఖ్య అతిథిగా డాక్టర్ అనితా రెడ్డి బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు, ఈ సందర్భంగా డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ…. మన తెలంగాణా పండుగ బతుకమ్మ అని ఈ పండుగ లో ప్రత్యేకత అందరి దేవుళ్లను పూలతో పూజిస్తే ఈ పండుగ ప్రత్యేకత పూలనే అమ్మవారిగా కొలవడం అని అన్నారు, మహిళలు తమ పసుపు కుంకుమలు కాపాడు తల్లి గా గౌరమ్మ ని కొలుస్తారని, ఇది ఏ దేశంలో లేని పండుగ అని, ఇది మన తెలంగాణా రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాల గొప్పతనం అని, అన్నారు, పండుగ సెలవులు వస్తుండటం తో ముందస్తు గా ఈ వేడుకలు నిర్వహించామని, మానసిక దివ్యాంగులకు ఆనందాన్ని పంచాలని ఈ కార్యక్రమం నిర్వహించామని పిల్లల ఆనందం, కోలాటం డాన్సులు, బతుకమ్మ పాటలు ఎంతో అలరించాయని డాక్టర్ అనితా రెడ్డి అన్నారు , అందరికి బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు, ఈ కార్యక్రమంలో డాక్టర్ అనితా రెడ్డి, డి. సి. పి. యు ప్రవీణ్ ,సుచరిత, వసుధ, హరిత, బార్గవి, లక్షీ తదితరులు పాల్గొన్నారు.




