పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 16
వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజుని శుక్రవారం హన్మకొండలోని ఆయన కార్యాలయంలో నేషనల్ యూత్ కాంగ్రెస్ సెక్రటరీ సాగరిక రమాకాంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి బతుకమ్మ, రావణ వధ ఉత్సవాలకు ఆహ్వానించారు.కాజీపేటలోని వడ్డేపల్లి ట్యాంక్ బండ్ వేదికగా నిర్వహించనున్న బతుకమ్మ ఉత్సవాలకు హాజరుకావాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కి ఆహ్వాన పత్రిక అందజేసి కోరారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.




