Sunday, September 20, 2026
Home Politics * 22-A భూములపై అసెంబ్లీలో బీఆర్‌ఎస్ నేతల అక్రమాల గుట్టు రట్టు చేసిన సీఎం రేవంత్...

* 22-A భూములపై అసెంబ్లీలో బీఆర్‌ఎస్ నేతల అక్రమాల గుట్టు రట్టు చేసిన సీఎం రేవంత్ రెడ్డి: టీపీసీసీ అధికార ప్రతినిధి డా. కోటూరి మానవతారాయ్…… ప్రెస్ మీట్ లో పాల్గొన్న హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి*

0
4

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక :  సెప్టెంబర్ 19

22-A నిషేధిత జాబితాలోని భూముల విషయంలో బీఆర్‌ఎస్‌ నేతలు ప్రజల్లో అనేక అపోహలు, అనుమానాలు సృష్టిస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణాలు చేస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి, వరంగల్ & హనుమకొండ సమన్వయకర్త డా. కోటూరి మానవతారాయ్ తీవ్రంగా ఖండించారు. వరంగల్ డీసీసీ భవన్ లో హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, వరంగల్ డీసీసీ అధ్యక్షుడు అయూబ్ సమక్షంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు కర్నాటి పార్వతమ్మ మరియు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.కోటి ఎకరాల ప్రజల భూములను సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ నిషేధిత జాబితాలో పెట్టినట్లు బీఆర్ఎస్ నేతలు విషప్రచారం చేశారని, వారి తప్పుడు ప్రచారాన్ని ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా సమర్థవంతంగా తిప్పికొట్టారని మానవతారాయ్ తెలిపారు. అధికారం పోయాక 22-A గురించి ఏమీ ఎరగనట్లు, రాజకీయ లబ్ధి కోసం ఈ సమస్యను కాంగ్రెస్ ప్రభుత్వమే సృష్టించినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, గంగుల కమలాకర్, గండ్ర వెంకటరమణారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మైహోమ్ రామేశ్వర్ రావుల భూ ఆక్రమణల బట్టలు విప్పారని మానవతారాయ్ పేర్కొన్నారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబాన్ని బోనులో బంధించారని, కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలతో ఇరుకున పెడదామని వ్యూహం పన్నిన బీఆర్ఎస్ నాయకులు, సీఎం వ్యూహంలో వారే చిక్కుకుపోయి అసెంబ్లీకి రాకుండా పారిపోయారని ఎద్దేవా చేశారు. 22-A నిషేధిత జాబితాలో భూముల పట్ల ప్రజలకు సంపూర్ణ అవగాహన కలిగిస్తూ ప్రభుత్వ నిషేధిత జాబితాలో మొత్తం 1,02,00,000 (కోటి రెండు లక్షల) ఎకరాలు ఉందని స్పష్టం చేశారు. ఇందులో 3,73,000 (మూడు లక్షల డెబ్బై మూడు వేల) ఎకరాలు మాత్రమే ప్రైవేటు భూమి అని, మిగిలిన 98,31,000 (తొంభై ఎనిమిది లక్షల ముప్పై ఒక్క వేల) ఎకరాల భూములు శాశ్వతంగా నిషేధిత జాబితాలోనే ఉంటాయని తేల్చి చెప్పారు.నిషేధిత జాబితాలో భూముల సమస్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఉందని, కేసీఆర్ పదేళ్ళ పాలనలో కూడా ఇది కొనసాగిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ లో నిషేధిత జాబితా (22-A) లో పొరపాటున చేరిన ప్రైవేటు భూములను సరిదిద్దడానికి నాటి సీసీఎల్ఏ విసి మనోరంజన్ పేరుతో 03-11-2022 న సింఎంటి-3691-2022 సర్క్యులర్ విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 22-A జాబితాలో మార్పులు చేయాలని హైకోర్టు ఆదేశించగా కలెక్టర్లు పొరపాటున పాత జాబితానే తిరిగి పొందుపరచడం వల్లే ఇప్పుడు సమస్య ఉత్పన్నం అయిందన్నారు. ఈ పొరపాటు వల్ల స్వయానా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇల్లు కూడా నిషేధిత జాబితాలో చేరిందని మానవతారాయ్ వెల్లడించారు. ఈ పొరపాటును గ్రహించిన రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి , రెవిన్యూ అధికారులు ఈ తప్పును సరిచేస్తామని ప్రకటించారని తెలిపారు. దీనిపై టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు తీసుకోగా, మొత్తం 980 ఫిర్యాదులు అందాయని, పొరపాటున నిషేధిత జాబితాలో చేరిన ప్రైవేటు వ్యక్తుల భూములను 15 రోజుల్లో పరిష్కారం చూపి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని వెల్లడించారు.నిజంగా ఇది అందరి సమస్య కాదని, ఇది కోట్లాది మంది సమస్యగా బీఆర్ఎస్ నేతలు చిత్రీకరిస్తూ దొంగనాటకాలాడుతున్నారని ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నప్పుడు నిషేధిత జాబితాలో ఉన్న వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను కొట్టేసిన బీఆర్ఎస్ నాయకుల సమస్య మాత్రమే ఇదన్నారు. 2004 వరకు ఎకరం భూమి లేని కేసీఆర్ కుటుంబ సభ్యులకు 2026 కల్లా 9 జిల్లాలు, 24 మండలాలు, 31 గ్రామాల్లో 439.30 ఎకరాల భూములు ఎట్లా వచ్చాయో తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే కేటీఆర్ కుమారుడు హిమాన్షు కు 46 ఎకరాల మేజర్ అయిన కొద్దిరోజుల్లోనే ఎట్లా సంపాదించాడో కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్ కుటుంబం మరియు బీఆర్ఎస్ నాయకుల భూముల బాగోతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి外 పెట్టగా, దానికి నష్ట నివారణ కోసం సీఎం రేవంత్ రెడ్డి కి 175 ఎకరాల భూములు ఉన్నాయని బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లో కలుపుకున్న ప్రభుత్వ భూములను శుద్ధితో అవమానించిన దళితులకు పంచాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నిర్ణయం అత్యంత అభినందనీయమని డా. కోటూరి మానవతారాయ్ కొనియాడారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.