Sunday, September 20, 2026
Home People **సి.కె.ఎం. ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్ట

**సి.కె.ఎం. ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్ట

0
6

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక     వరంగల్, సెప్టెంబర్ 18:

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద శుక్రవారం వరంగల్ ఉర్సు మట్వాడలోని సి.కె.ఎం. అనుబంధ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్‌ లోని మిషనరీస్ ఎలా ఉన్నాయి ఆసుపత్రి స్లాబ్ మరియు ఇతర పరిసరాల తో పాటు అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను కలెక్టర్ పరిశీలించారు.రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చేపడుతున్న ఏర్పాట్లు, ఆసుపత్రి పనితీరును సమీక్షించారు.ఆసుపత్రి ప్రాంగణం లో ఉన్న జిల్లా ఔషద గిడ్డంగి నిర్వాహాండ్ అస్తవ్యస్తంగా అమర్చిన తీరుకు కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమ పద్ధతిన ఆర్డర్ వైజ్ గా ఉండేలా చూడాల్సిన లాబ్ ఆపరేటర్ ను ఆదేశించారు.ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె. లక్ష్మీదేవి, ఇన్‌చార్జ్ ఆర్‌ఎంఓ డాక్టర్ కె. సత్యజీత్ రే ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న సౌకర్యాల గురించి కలెక్టర్‌కు వివరించారు.ఈ తనిఖీలోఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె. లక్ష్మీదేవి, ఇన్‌చార్జ్ ఆర్‌ఎంఓ డాక్టర్ కె. సత్యజీత్ రే ,
ఖిలా వరంగల్ తహసిల్దార్ ఇక్బాల్, తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.