పరివర్తన అవాజ్ సెప్టెంబర్ 20
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు పుట్ట రవి తల్లి పుట్ట రాజమ్మ ఇటీవల మృతి చెందడంతో వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు 65వ డివిజన్లోని సుబ్బయ్యపల్లి గ్రామంలోని వారి నివాసానికి వెళ్లి రాజమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా పుట్ట రాజమ్మ మృతికి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సంతాపం వ్యక్తం చేసి, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రాజమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.అనంతరం 65వ డివిజన్ లోని మధుతండకు చెందిన పోరిక ప్రవీణ్ తండ్రి పోరిక హరి అనారోగ్యంతో ఉన్న విషయం తెలుసుకొని వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో 65వ డివిజన్ అధ్యక్షులు నేదునూరి సునీల్,జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యల రామిరెడ్డి,మండల అధ్యక్షులు అశోక్ కుమార్, ఆత్మకూర్ మార్కెట్ వైస్ చైర్మన్ తిరుపతి, మాజీ మండల అధ్యక్షులు పోరాడి మహేందర్ రెడ్డి, 66వ డివిజన్ అధ్యక్షులు గొర్రె కిరణ్, రెండవ డివిజన్ అధ్యక్షులు పుట్ట తిరుపతి, సీనియర్ నాయకులు సురేందర్ రెడ్డి, మల్లేశం, వెంకటస్వామి, బలుకూరి శ్రీనివాస్, వసుకుల చిరంజీవి, పుట్ట కృష్ణస్వామి, పుట్ట సురేందర్, సంజీవ, రామంచ ఐలయ్య, యువ నాయకులు మట్ల విష్ణు, తిరుపతి, భీమ నాయక్, కుమార్, ప్రవీణ్, లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.



