- పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 26:
వరంగల్ జిల్లాలోని అన్ని మండలాల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ సంఘాల బాధ్యులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద శనివారం జిల్లా కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో జిల్లాలో ఉపాధ్యాయుల వర్క్ అడ్జస్ట్‌మెంట్ ప్రక్రియపై సుదీర్ఘంగా చర్చించారు.జిల్లాలోని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల అవసరం, ప్రస్తుతం అందుబాటులో ఉన్న బోధనా సిబ్బంది వివరాలను పరిగణనలోకి తీసుకుని సమగ్రంగా సమీక్షించారు.విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల అవసరాన్ని అంచనా వేసి, ఉపాధ్యాయులు అవసరమైన పాఠశాలలకు సర్దుబాటు చేయడం ద్వారా బోధనా ప్రక్రియ సజావుగా కొనసాగేలా చర్యలు చేపట్టాలని సమావేశంలో చర్చించారు.విద్యార్థుల విద్యా ప్రయోజనాలను ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని, పాఠశాలల వారీగా ఉపాధ్యాయుల అవసరాలను పరిశీలించి, నిబంధనల ప్రకారం వర్క్ అడ్జస్ట్‌మెంట్ ప్రక్రియను చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు.




