Author: laxman RAO
పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-విద్యానగర్ కాలనీ బైపాస్ రోడ్డులో గణతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కే. సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత రాజ్యాంగ విలువలను ప్రతి పౌరుడు గౌరవించాలని, దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చుంచుపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ శాంతి శ్రీ, సీపీఐ చుంచుపల్లి మండల కార్యదర్శి, ఉపసర్పంచ్ వాసిరెడ్డి మురళి, వార్డు సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ గీతాలాపనతో పాటు నిర్వహించినారూ. ప్రజల విస్తృత భాగస్వామ్యంతో గణతంత్ర దినోత్సవ వేడుకలు విజయవంతంగా ముగిశాయి.
పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-విద్యానగర్ కాలనీ బైపాస్ రోడ్డులో గణతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కే. సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత రాజ్యాంగ విలువలను ప్రతి పౌరుడు గౌరవించాలని, దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చుంచుపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ శాంతి శ్రీ, సీపీఐ చుంచుపల్లి మండల కార్యదర్శి, ఉపసర్పంచ్ వాసిరెడ్డి మురళి, వార్డు సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ గీతాలాపనతో పాటు నిర్వహించినారూ. ప్రజల విస్తృత భాగస్వామ్యంతో గణతంత్ర దినోత్సవ వేడుకలు విజయవంతంగా ముగిశాయి.
పరివర్తన అవాజ్ ,కొత్తగూడెం:- రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని కొత్తగూడెం ఎంజీ రోడ్‌లోని గణేష్ టెంపుల్ ఆలయంలో అవుటుపల్లి రాంబాబు గురుస్వామి పుట్టినరోజు వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన శిష్య బృందం, డోలక్ రంజిత్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు, పాటల కచేరి నిర్వహించారు. కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. అనంతరం గణేష్ టెంపుల్ ఆలయంలో మాఘమాసం మొత్తం శ్రీ సూర్యనారాయణ స్వామివారి ప్రీతికోసం భక్తులకు గోత్రనామాలతో పూజలు, సూర్య నమస్కార పూజల విధానాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. సూర్య జయంతి రథసప్తమి సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. పాటల కార్యక్రమంలో చదలవాడ సూరి, గాయకుడు పేర్ల సుదీర్ పాల్గొనగా, సౌండ్ సిస్టమ్‌ను జీడి విశాల్ సమకూర్చారు. దారా రమేష్‌తో పాటు భక్త బృందం, ఆలయ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పరివర్తన అవాజ్,కొత్తగూడెం నంద తండ గ్రామపంచాయతీ పరిధిలోని ప్రజలందరికీ తెలియజేయునది ఏమనగా,రేపు గ్రామపంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడనున్నాఈ శుభ సందర్భంలో గ్రామ ప్రజలందరూ అధిక సంఖ్యలో హాజరై, జాతీయ పండుగకు తగిన గౌరవం చెల్లిస్తూ, గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో జరుగుతున్న వేడుకలను విజయవంతం చేయాలని సర్పంచ్ గారు వినమ్రంగా విన్నవించుచున్నారు. తేదీ: రేపుస్థలం: నంద తండ గ్రామపంచాయతీ కార్యాలయం మీ అందరి సహకారం, పాల్గొనడం ఎంతో అవసరం.
సింగరేణి కార్మికులకు రూ. 30 లక్షల వడ్డీ లేని రుణం ఇవ్వాలి కార్మికులకు రూ. 10 వేల కనీస పెన్షన్, కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన కూనంనేని సింగరేణి క్వార్టర్లను మాజీ కార్మికులకే కేటాయించాలి ఇల్లందు గెస్ట్ హౌస్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయిన ఎమ్మెల్యే కూనంనేని సింగరేణి సమస్యలపై కేంద్రానికి గళం వినిపించిన కూనంనేని సాంబశివరావు పరివర్తన అవాజ్,కొత్తగూడెం :- కేంద్ర బొగ్గు గనుల శాఖా మంత్రి కిషన్ రెడ్డి కొత్తగూడెం పర్యటన సందర్భంగా, ఇల్లందు గెస్ట్ హౌస్‌లో కొత్తగూడెం ఎమ్మెల్యే, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆయనను ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థ మనుగడ, కార్మికుల సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలతో కూడిన మెమోరాండంను మంత్రికి అందజేశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడిన కూనంనేని, సింగరేణి ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెంచేందుకు పెనగడప, పూనుకుడుచెలక, రాంపూర్, గుండాలలో తక్షణమే కొత్త…
పరివర్తన అవాజ్,కొత్తగూడెం విద్యానగర్ కాలనీ పంచాయితీ పరిధిలోని 6వ వార్డులో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన భూమి చదును చేసే కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. స్థానిక ప్రజల దీర్ఘకాలిక అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని చేపట్టిన ఈ అభివృద్ధి కార్యక్రమానికి పంచాయితీ పాలకవర్గం ప్రత్యేక చొరవ చూపింది. ఈ కార్యక్రమంలో సర్పంచి భూక్య శాంతి , ఉపసర్పంచ్ వాసిరెడ్డి మురళి , అలాగే 6వ వార్డు మెంబర్ వాడపల్లి జకరయ్య స్వయంగా హాజరై పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే వార్డు ప్రజలకు రాకపోకల సమస్యలు తొలగి, మౌలిక వసతులు మరింత మెరుగవుతాయని నాయకులు తెలిపారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా పంచాయితీ నిరంతరం కృషి చేస్తుందని, ప్రతి వార్డులో అవసరమైన పనులను దశలవారీగా చేపడతామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. కార్యక్రమాన్ని స్థానిక ప్రజలు హర్షాతిరేకాలతో స్వాగతించి పంచాయితీ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
డీసీసీ అధ్యక్షురాలు దేవి ప్రసన్నకు బయోడేటా అందజేత కొత్తగూడెం, పరివర్తన అవాజ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని 39వ డివిజన్ కార్పొరేటర్ టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త ఎస్‌కే యాకుబ్ పాషా బరిలోకి దిగారు. ఈ సందర్భంగా ఆయన తన బయోడేటాను డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్నకు అందజేశారు. అదేవిధంగా టీపీసీసీ జనరల్ సెక్రెటరీ నాగ సీతారాములు, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చీకటి కార్తీక్‌లను మర్యాదపూర్వకంగా కలిసి, 39వ డివిజన్‌కు సంబంధించి తన ఆవేదనను తెలియజేశారు. ఈ సందర్భంగా యాకుబ్ పాషా మాట్లాడుతూ,39వ డివిజన్‌లో సుమారు 70 శాతం మైనార్టీ జనాభా ఉన్నందున ఈ డివిజన్‌ను మైనార్టీలకు కేటాయిస్తే గెలుపు నల్లేరు మీద నడకలా సులభమవుతుందని పేర్కొన్నారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు ఈసారి అవకాశం కల్పించాలని కోరారు. గత 10 సంవత్సరాలుగా ఎలాంటి…
తెలంగాణ రాష్ట్ర బంజారాల ‘శ్రీశ్రీశ్రీ సాతి భవాని’ మహాజాతర – జాతరకు తరలిరానున్న యావత్ హిందూ సమాజం – అన్ని అనుమతులతో జాతర నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు – వారం రోజులపాటు ప్రత్యేక పూజలు, హోమాలు (భోగ్ బండారో) – జాతరకు సహకరిస్తున్న కలెక్టర్, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు – సేవాలాల్ మహారాజ్ జయంతికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలి – విలేకరుల సమావేశంలో బంజారా సంఘాల జేఏసీ వైస్ చైర్మన్ బానోత్ వీరూ నాయక్ పరివర్తన అవాజ్,కొత్తగూడెం బంజారాల ఆరాధ్య దైవాలు అయిన ‘శ్రీశ్రీశ్రీ సాతి భవాని’ అమ్మవార్ల మహాజాతర ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు వారం రోజులపాటు ఘనంగా నిర్వహించేందుకు బంజారా సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ శంకర్ నాయక్ పర్యవేక్షణలో ఏర్పాట్లు చేస్తున్నట్లు బంజారా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైస్ చైర్మన్ బానోత్ వీరూ నాయక్…
కాసాని వర్ధంతి సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు పరివర్తన అవాజ్ క్షేత్ర స్థాయిలో ప్రజా పోరాటాలు నిర్మించడమే కాసానికి ఇచ్చే ఘనమైన నివాళి అని సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు అన్నారు.స్థానిక మంచికంటి భవన్లో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లిక్కి బాలరాజు అధ్యక్షతన జరిగిన వర్ధంతి సభ జరిగింది.ముందుగా కాసాని చిత్ర పటానికి మచ్చ వెంకటేశ్వర్లు పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ నిజాయితీగా చివరి శ్వాస వరకు ఎర్రజెండా నీడలో పని చేసిన కాసాని నేటి తరానికి ఆదర్శమని అన్నారు.అత్యంత నిరాడంబర జీవితం కమ్యూనిస్టు విలువలు పాటించిన గొప్ప కమ్యూనిస్టు యోధుడు కాసాని అని కొనియాడారు. ఇళ్ల స్థలాల పోరాటం ద్వారా పదిహేనువేల మందికి ఇళ్ల స్థలాలు ఇప్పించిన ప్రజా పోరాట యోధుడని అన్నారు. ఈ పోరాటంలో జైలుకి సైతం వెళ్ళారని గుర్తుచేశారు.ప్రస్తుతం పాలక ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా…
– 29వ డివిజన్ లో పోటీ చేస్తున్న చదలవాడ సూరి – ప్రజలనుంచి విశేష జనాదరణ… పరివర్తన అవాజ్,కొత్తగూడెం నా డివిజన్లోని ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని… గత పాలకులు చేసిందేమి లేదని, మీకు న్యాయం చేయాలనీ, మీకు అందరికి అందుబాటులో ఉంటానని చదలవాడ సూరి విజ్ఞప్తి చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలోని ఉన్న 29వ డివిజన్ ప్రతి ఒక పార్టీ నుంచి ఒక అభ్యర్థి నిలబడతారు. అందులో గతంలో పోటీ చేసినటువంటి మాజీ కౌన్సిలర్స్ కూడా కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కాబట్టి 29వ డివిజన్ ప్రజలు… గతంలో మాజీ కౌన్సిలర్స్ జనాలని ఎంత పీడించుకొని తిన్నారనేది మీ అందరికీ తెలిసిన విషయమే… కొత్త మీటర్ పెట్టాలంటే 20,000 రూపాయలు తీసుకున్నారని ఆరోపించారు. అలాగే ఇంటి నెంబర్ కావాలంటే 50 వేల నుంచి లక్ష రూపాయలు వరకు వసూళ్లు చేశారు క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలన్నా ఇన్కమ్…
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.