Author: laxman RAO
పరివర్తన ఆవాజ్ :-కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 25వ జనరల్ వార్డు నుంచి బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా కురిమెల్ల శంకరయ్య నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ ప్రక్రియ పూర్తి అయిన అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆయనకు ధృవపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా కురిమెల్ల శంకరయ్య మాట్లాడుతూ, గత 20 సంవత్సరాలుగా దేశంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ ఉద్యమ మార్గంలో పోరాటం చేస్తున్నానని తెలిపారు. బీసీలకు రాజకీయ అధికారం సాధించాలంటే బహుజన్ సమాజ్ పార్టీ ద్వారానే సాధ్యమని నమ్మి పార్టీలో చేరి, కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పారు.స్వతంత్ర భారతదేశానికి 70 సంవత్సరాలు పూర్తయినా బీసీలకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ ప్రాతినిధ్యం లభించకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజలు తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. అగ్రవర్ణ పార్టీల ఆధిపత్యానికి గట్టి బుద్ధి చెప్పాలని పిలుపునిస్తూ, 25వ వార్డు నుంచి తనను భారీ…
పరివర్తన అవాజ్ :-కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 59వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న మహమ్మద్ హుస్సేన్ ఖాన్ నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు.అవినీతికి తావివ్వని నిజాయితీపరుడు,విద్యతో సమాజాన్ని వెలిగించే విద్యావంతుడు,నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యంగా పనిచేసే ప్రజల మనిషి మహమ్మద్ హుస్సేన్ ఖాన్.గతంలో మాటలకే పరిమితం కాకుండా,ముస్లిం పిల్లలతో పాటు అన్ని వర్గాల విద్యార్థులకు చదువు విషయంలో తన వంతు సహాయ సహకారాలు అందించి,తన చేతలతో సేవ చేసి చూపించిన నాయకుడు ఆయన.ఇప్పుడు 59వ డివిజన్ భవిష్యత్తును అభివృద్ధి, పారదర్శకత, సంక్షేమం వైపు నడిపించేందుకు ముందుకు వచ్చారు. నిజాయితీకి ఓటు వేయండి.అవినీతి లేని పాలనకు ఓటు వేయండి.ప్రజల సమస్యలు తన సమస్యలుగా భావించే నాయకుడికి ఓటు వేయండి.59వ డివిజన్ నుంచి మహమ్మద్ హుస్సేన్ ఖాన్‌ను అత్యధిక మెజారిటీతో కార్పొరేటర్‌గా గెలిపిద్దాం!మీ ఒక్క ఓటు – 59వ డివిజన్ భవిష్యత్తు మార్పుకు బాట వేస్తుంది!
పరివర్తన అవాజ్, కొత్తగూడెం:-తెలంగాణ సంస్కృతి–సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన మేడారం సమ్మక్క–సారలక్కల మహాజాతరను పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సుజాతనగర్ మండలం గరీబ్‌పేట గ్రామంలో గురువారం సమ్మక్క–సారలమ్మల జాతరను భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. వనం నుంచి జనంలోకి అమ్మవారి ప్రవేశం సందర్భంగా గ్రామమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది. గరీబ్‌పేటలోని సమ్మక్క–సారలమ్మ గద్దెలపై సమ్మక్క తల్లి కొలువుదీరగా, ఆదివాసీ గిరిజనులు సంప్రదాయ రీతుల్లో విశిష్ట పూజలు నిర్వహించారు. గిరిజన సంప్రదాయాలు, వేషధారణ, డోలు మ్రోగింపులతో జాతర మరింత శోభాయమానంగా మారింది. కొండలరావు శాంతాదేవి సాయి ఆధ్వర్యంలో జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, ప్రసాద పంపిణీ వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు.…
కాంగ్రెస్ మద్దతుతో 21,31 డివిజన్లలో సిపిఎం పోటీసిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు పరివర్తన అవాజ్,కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు తెలిపారు. స్థానిక మంచి కంటి భవన్లో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటైన కొత్తగూడెం కార్పొరేషన్ జరుగుతున్న ఎన్నికల్లో సిపిఎం రెండు డివిజన్లలో కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేస్తుందని తెలిపారు. ఎన్నికల్లో అనేక మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నప్పటికీ ప్రశ్నించే గొంతుకులను పాలకమండలిలో ఉంచాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని ఆయన గుర్తు చేశారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చే సిపిఎం అభ్యర్థులను గెలిపించడం ద్వారా వాటి పరిష్కారానికి మరింత పోరాటం చేయడానికి అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ అనేక నిర్బంధాలను ఎదుర్కొంటూ ప్రజా ప్రతినిధుల సభలలో ప్రజల వాణిని వినిపించడానికి అవకాశం వచ్చిన ఈ సందర్భంలో సిపిఎం అభ్యర్థులను…
పరివర్తన అవాజ్,కొత్తగూడెం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే జాతీయ పండుగ మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ పంచాయతీ పరిధిలోని గరీపేట గ్రామంలో జాతర ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మంగళవారం నుంచి ప్రారంభమైన ఈ జాతర వేడుకలు భక్తుల సందడితో ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఆలయ కమిటీ ప్రధాన సభ్యులు కామిశెట్టి కొండలరావు, శాంతాదేవి తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 22వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జాతర నిర్వహించనున్నారు. 28వ తేదీన సారలమ్మ వనం విడిచి గ్రామంలోకి రానుండగా, 29వ తేదీన సమ్మక్కను గ్రామానికి తీసుకురానున్నారు. 30వ తేదీన విశిష్ట పూజలు నిర్వహించి, 31వ తేదీన తిరిగి వనవాసానికి అమ్మవార్లను చేర్చనున్నారు. జాతరలో భాగంగా చిలకల గుట్ట వద్ద సంప్రదాయ బూరుగుల పూజలు, పెద్దమ్మ తల్లి సమ్మక్క–సారలమ్మ సామెత శివాలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ జాతరకు కొత్తగూడెం నియోజకవర్గం…
స్థానిక యుద్దానికి మేం సిద్ధం తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ భద్రాద్రి అధ్యక్షులు కట్ట సతీష్ పరివర్తన అవాజ్ కొత్తగూడెం:-భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బహుజనుల రాజ్యాధికార సాధనగా భవిష్యత్తు పోరాట లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కట్ట సతీష్ అన్నారు. కొత్తగూడెంలోని నందా తండాలో నూతన జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతు రాబోయే కొత్తగూడెం కార్పొరేషన్, ఇల్లందు అశ్వరావుపేట, మున్సిపల్ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సీట్లు కేటాయించి అన్ని స్థానాల్లో బహుజనులను గెలిపించేందుకు తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ ముందుకు వచ్చిందన్నారు. అణగారిన వర్గాల ప్రజలంతా ఏకతాటిపై వచ్చి ఐకమత్యంతో బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకులను కార్పొరేటర్, కౌన్సిలర్ లుగా గెలిపించుకుంటేనే రాజ్యాధికారం మన చేతుల్లో…
పరివర్తన కొత్తగూడెం : 77 వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్తగూడెం పట్టణంలోని ప్రగతి మైదాన్ లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా యస్పి రోహిత్ రాజు చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 2025 వ సంవత్సరంలో భాధ్యతయుత ఉద్యోగ, కర్తవ్య నిర్వహణలో చేసిన అవిరళ కృషికి గుర్తింపుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు సబ్బాతి సుమిత్రా దేవి, మహమ్మద్ సాదిక్ పాషా లకు కలేక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ ఐ.ఏ.యస్. ప్రశంసా పత్రము అందజేశారు. 2021 నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ లో సుమిత్రా దేవి, సాదిక్ పాషా ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులుగా చేసిన సేవలకు గుర్తింపు గా ప్రసంసా పత్రం అందుకోవడం…
ఆర్టీసీతో సురక్షిత ప్రయాణం..సుఖమయ దర్శనం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను వినియోగించుకోవాలి మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ప్రేత్యేక ఏర్పాట్లు చేయండి ప్రజా రవాణాలో ఆర్టీసీ పాత్ర కీలకంగా ఉండాలి కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు ఘనంగా మేడారం ప్రత్యేక బస్సుల ప్రారంభోత్సవం పరివర్తన అవాజ్,కొత్తగూడెం ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్లే భక్తుల కోసం కొత్తగూడెం ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులను సోమవారం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు. స్థానిక బస్టాండులో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన బస్సులకు పచ్చజెండా ఊపి ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతర సమయంలో భక్తులకు ఎటువంటి రవాణా ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ యాజమాన్యం ముందస్తుగా ప్రత్యేక చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. ప్రైవేట్ వాహనాల కంటే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం ఎంతో సురక్షితమని, భక్తుల రద్దీకి అనుగుణంగా మరిన్ని బస్సులు…
పరివర్తన అవాజ్:- కొత్తగూడెం కార్పొరేషన్ 14వ వార్డు సుభాష్ చంద్రబోస్ నగర్, రామవరం ప్రాంతంలోని మోడ్రన్ ఇఖ్రా స్కూల్‌లో 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందస్తు వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ షేక్ అబ్దుల్ బాసిత్ మాట్లాడుతూ, భారతదేశం ప్రపంచ దేశాలన్నింటిలో అత్యుత్తమ రాజ్యాంగం కలిగిన దేశమని అన్నారు. వివిధ కులాలు, మతాలు, భిన్న సంస్కృతులు కలిగిన ప్రజలంతా ఒక్కటిగా జీవించేందుకు సమాన హక్కులు, బాధ్యతలు కల్పించిన భారత రాజ్యాంగం ప్రతి పౌరుడు గౌరవించాల్సిన గొప్ప గ్రంథమని ఆయన పేర్కొన్నారు.కార్యక్రమంలో భాగంగా పాఠశాల చిన్నారులు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రాజ్యాంగ ఔన్నత్యాన్ని చాటి చెప్పే ప్రసంగాలు చేయగా, దేశభక్తి గీతాలతో సభను అలరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు పర్వీన్ సుల్తానా, ఉపాధ్యాయులు నసరత్, శిరీషా, విజయలక్ష్మీ, నాజీయా, నీలా, సరస్వతీ, అనితా, జేఫీషా, సల్మా, సుహాన తదితరులు పాల్గొన్నారు.
పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-రామవరం జామియా మసీద్ ఆవరణలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రామవరం ప్రముఖ వస్త్ర వ్యాపారి సయ్యద్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఎగురవేసి ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కవిత రూపంలో యువతకు సందేశం ఇస్తూ మతసామరస్యం, పరమత సహనం పాటిస్తూ కులమత భేదాలను విడనాడి దేశ అభివృద్ధికి ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం శ్రీశ్రీ కళావేదిక తెలుగు అసోసియేషన్, ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు గోదావరి సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అక్షర ప్రవీణ జాతీయ ప్రతిభా పురస్కారం అందుకున్న సయ్యద్ అబ్దుల్ నజీర్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జామియా మసీద్ సదర్ కమిటీ సభ్యులు, పురప్రముఖులు పాల్గొన్నారు.
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.