Author: laxman RAO

పరివర్తన అవాజ్ :-హౌసింగ్ బోర్డు ప్రాంతంలో సమ్మక్క–సారక్క గుడి నుంచి ముత్యాలమ్మ గుడి వరకు బోనాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు.గుడి పూజారి హగ్ మేర సోను ఆధ్వర్యంలో సమ్మక్క–సారక్క గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి, బోనం బోనం ఎత్తుకొని భక్తులు ముత్యాలమ్మ గుడికి తరలివెళ్లారు.ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బోనాల ఊరేగింపు సందర్భంగా డప్పుల చప్పుళ్లు, మహిళల కోలాటాలు, భక్తుల నినాదాలతో ప్రాంతమంతా భక్తిశ్రద్ధలతో మార్మోగింది.ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృప పొందారు. స్థానికులు, మహిళలు, యువతీ యువకులు పెద్ద ఎత్తున పాల్గొనడంతో కార్యక్రమం ఉత్సవ వాతావరణంలో కొనసాగింది.

Read More

సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు రాష్ట్ర నాయకుడు ఆళ్ల మురళి పిలుపు పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అఖండ భారీ మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు ఆళ్ల మురళి సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఈరోజు కొత్తగూడెం ఏరియా వీకేఓసీ (వీకేఓసి) లో జెట్టి మోహన్, బూరుగు సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆళ్ల మురళి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని, రాష్ట్ర గౌరవ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (శీనన్న) జిల్లాలో ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తూ పరిష్కరిస్తున్నారని అన్నారు. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడిగా శీనన్న జిల్లాలో తనదైన ముద్ర వేసారని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు…

Read More

55వ డివిజన్లో బి ఆర్ ఎస్ ఎన్నికల ప్రచార హోరు…అందరికంటే ముందంజలో ఇమంది గణేష్..కారు గుర్తుకి ఓటేయాలని జోరుగా ప్రచారం. పరివర్తనవాజ్, కొత్తగూడెం:-కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికలలో 55వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న ఇమంది గణేష్ ఇంటింటి ప్రచారం మంచి ఉత్సాహంగా కొనసాగింది.. ప్రచారంలో ప్రతి చోట చిన్న పెద్ద అందరూ కెసిఆర్ ప్రభుత్వ హయాంలోనే అనేక సంక్షేమ పథకాలు అందాయని మళ్లీ కెసిఆర్ ప్రభుత్వమే రావాలని కారు గుర్తుకే ఓటేస్తామని మాటిస్తున్నారు.. స్థానికంగా కూలీలైన్ 55వ డివిజన్లో పుట్టి పెరిగిన ఇమంది గణేష్ కు విశేష మద్దతు లభిస్తుంది.స్థానికంగా నివాసం ఉంటూ అందరికీ అందుబాటులో ఉండే యువకుడు ఉన్నత విద్యావంతుడైన గణేష్ లాంటి యువ నాయకత్వం 55వ డివిజన్ కు చాలా అవసరమని ప్రజలు అంటున్నారు.ఎప్పుడు పాతవారికి పాత పార్టీలకు కాకుండా కొత్తవారు రావాలని జనం అభిప్రాయపడుతున్నారు. ప్రచారంలో భాగంగా ప్రజలు ప్రతినిత్యం ఉండే సమస్యలను త్వరితగతిన పూర్తి చేయాలని…

Read More

పరివర్తన అవాజ్,కొత్తగూడెం టౌన్ :-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం డీఎస్పీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఎల్. ఆదినారాయణను శనివారం టైక్వాండో జిల్లా కార్యదర్శి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇనీగాల మొగిలి ఆధ్వర్యంలో అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. గతంలో కొత్తగూడెం త్రీటౌన్ సీఐగా విధులు నిర్వహించిన అనుభవంతో పోలీస్ శాఖలో మంచి గుర్తింపు, మంచి పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. అదే తరహాలో కొత్తగూడెం డీఎస్పీగా కూడా ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డీఎస్పీ ఎల్. ఆదినారాయణ మాట్లాడుతూ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, ముఖ్యంగా కొత్తగూడెంలో అనేకమంది ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉన్నారని తెలిపారు. క్రీడలంటే తనకు ప్రత్యేక మక్కువ ఉందని, క్రీడాకారులకు ఎలాంటి సహాయ-సహకారాలు అవసరమైనా పోలీస్ శాఖ తరఫున ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రధానంగా యువత క్రీడల్లో రాణించాలని, మత్తుపదార్థాలకు దూరంగా ఉండి శారీరక దృఢత్వాన్ని పెంచుకోవాలని సూచించారు. క్రీడల్లో ప్రతిభ చూపించి…

Read More

చర్మకారుల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్తా చర్మకారుల సంఘం జిల్లా అధ్యక్షులు చదలవాడ సూరి పరివర్తన్నవాజ్,కొత్తగూడెం:- ఫిబ్రవరి 01 సమాజ శ్రేయస్సు కోసం పరితపించిన గొప్ప మేధావి సంత్‌ గురు రవిదాస్‌ మహరాజ్‌ అని చర్మకారుల సంఘం జిల్లా అధ్యక్షులు చదలవడా సూరి అన్నారు. ఆయన మార్గం అందరికీ అనుసరణీయమని పేర్కొన్నారు. సంత్‌ రవిదాస్‌ 650వ జయంతి వేడుకలు ఆదివారం స్థానిక రైల్వే స్టేషన్ పరిధిలోని చర్మకారుల సంఘం కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చదలవాడ సూరి .. సంత్‌ రవిదాస్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చర్మకార కులంలో పుట్టిన వజ్రంగా సంత్‌ రవిదాస్‌ను అభివర్ణించారు. మానవతా సుగంధాన్ని విరజిమ్మే కవితోద్యమం ఆయన సొంతమని పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ స్నేహభావంతో మెలగాలని, మనుషులంతా ఒక్కటేనన్న సమానత్వ సందేశాన్ని 14వ శతాబ్దంలోనే ఇచ్చిన సంత్‌ రవిదాస్‌…

Read More

    59వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా ఎండీ. హుస్సేన్ ఖాన్ నామినేషన్ దాఖలు పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో 59వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా స్థానిక యువ నాయకుడు ఎండీ. హుస్సేన్ ఖాన్ శుక్రవారం అధికారికంగా తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు. నామినేషన్ అనంతరం ఎండీ. హుస్సేన్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ, గత రెండు దశాబ్దాలుగా కుల, మత, రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నానని తెలిపారు. ముఖ్యంగా పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు ఉపకార వేతనాలు అందేలా చేయడంలో, అలాగే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మార్గనిర్దేశం చేయడంలో నిరంతరం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. తనను 59వ డివిజన్ ప్రజలు గెలిపిస్తే, ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం వారి మధ్యనే ఉండి సమస్యల పరిష్కారానికి అహర్నిశలు శ్రమిస్తానని ఆయన హామీ ఇచ్చారు. డివిజన్ అభివృద్ధి, ప్రజా…

Read More

  25వ జనరల్ డివిజన్‌లో భారీ మెజార్టీతో గెలిపించాలి: బీఎస్పీ నేతల పిలుపు పరివర్తన అవాజ్, కొత్తగూడెం కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థిగా 25వ జనరల్ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న కురిమెళ్ల శంకర్‌కు పార్టీ అధికారిక బి–ఫారం అందజేశారు. బీఎస్పీ జోనల్ ఇంచార్జ్ కదిరే కృష్ణ చేతుల మీదుగా కురిమెళ్ల శంకర్ బి–ఫారం స్వీకరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ తాండ్ర వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి సిద్ధార్థ పూలే తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రస్తుత తరుణంలో జరుగుతున్న కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో 25వ జనరల్ డివిజన్ నుంచి కురిమెళ్ల శంకరయ్యను భారీ మెజార్టీతో గెలిపించి బీఎస్పీ బలాన్ని చాటాలని ప్రజలను కోరారు.బహుజనుల హక్కులు, సమానత్వం, సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాటం చేస్తున్న పార్టీగా బీఎస్పీ ప్రజల విశ్వాసాన్ని సంపాదించిందని, కురిమెళ్ల శంకర్ విజయం…

Read More

పరివర్తన అవాజ్ :-పోలీస్ శాఖలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తూ ఎనలేని సేవలందించి శనివారం తో పదవీ విరమణ పొందిన ఒక ఏఎస్సై,ఒక ఏఆర్ఎస్సై ను ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు ఘనంగా సత్కరించారు.43 సంవత్సరాలు పోలీసు శాఖలో పనిచేసి ప్రస్తుతం స్పెషల్ బ్రాంచ్ నందు విధులు నిర్వర్తిస్తూ పదవీ విరమణ పొందిన ఏఎస్సై మంచా నాయక్ ను,41 సంవత్సరాలు తమ సేవలను అందించి జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు విధులు నిర్వర్తిస్తూ పదవీ విరమణ పొందిన ఏఆర్ఎస్సై సూర్యనారాయణ లు శనివారం పదవీ విరమణ పొందడం జరిగింది. పదవీ విరమణ పొందిన ఈ ఇద్దరు అధికారులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శాలువాలతో మరియు పూలమాలతో ఘనంగా సత్కరించడం జరిగింది.అనంతరం పోలీస్ శాఖలో వీరి అనుభవాలను జిల్లా ఎస్పీతో పంచుకున్నారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన పోలీసు…

Read More

ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రం అందజేత కొత్తగూడెం, పరివర్తన అవాజ్ : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 53వ డివిజన్‌కు కాంగ్రెస్ పార్టీ తరఫున కార్పొరేటర్ అభ్యర్థిగా పల్లపు వెంకటేశ్వర్లు గురువారం అధికారికంగా నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్నికల అధికారికి తన నామినేషన్ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పల్లపు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల మధ్యకు తీసుకెళ్లడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. అలాగే 53వ డివిజన్ పరిధిలోని మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు. పార్టీ అధిష్టానం ఆమోదంతో ప్రజలకు మరింత చేరువై పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని పల్లపు వెంకటేశ్వర్లకు మద్దతు ప్రకటించారు. 53వ డివిజన్‌లో కాంగ్రెస్…

Read More

  పరివర్తన అవాజ్, కొత్తగూడెం కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చిట్టి రామారం 19వ డివిజన్ నుంచి కార్పొరేటర్ అభ్యర్థిగా భానోత్ రాంబాబు నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ఎన్నికల బరిలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బానోతు గోబ్రియ నాయక్ రాజకీయ వారసుడిగా భానోత్ రాంబాబు ప్రజల్లో మంచి గుర్తింపు పొందారు. గతంలో ఎన్నో ప్రజాప్రయోజన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని, సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యారు. ఈ సందర్భంగా భానోత్ రాంబాబు మాట్లాడుతూ, చిట్టి రామారాన్ని అవినీతి రహితంగా అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు. ప్రజల మౌలిక సదుపాయాలైన రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. స్థానిక ప్రజలు మాట్లాడుతూ, భానోత్ రాంబాబు నిజాయితీపరుడు, ప్రజల సమస్యలపై అవగాహన ఉన్న నాయకుడని పేర్కొన్నారు. ఆయనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఓటర్లందరూ ఒకే స్వరంతో…

Read More