Author: laxman RAO
– మరింతగా అభివృద్ధి చేస్తాను…- గత ఐదేళ్లలో అభివృద్ధిని పరుగులు పెట్టించాను..- మరల బరిలో ఉన్న… ఆశీర్వదించండి…పరివర్తన అవాజ్,కొత్తగూడెం :-నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలే మరలా నాకు కార్పొరేటర్ గా నిలబడే అవకాశాన్ని ఇచ్చాయని… ప్రజలు అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలని మాజీ కౌన్సిలర్ బాలిశెట్టి సత్యభామ అభ్యర్థిస్తున్నారు. గత మున్సిపాలిటీలో కౌన్సిలర్ గా ఉన్న సమయంలో ఆమె చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ఓటర్లకు వివరిస్తున్నారు. ఈసారి కూడా అవకాశం ఇవ్వండి తమ డివిజన్ మరింతగా అభివృద్ధి చేసి చూపిస్తానంటూ ఆమె అభ్యర్థిస్తున్నారు. ఆమె చేసిన అభివృద్ధి పనుల వివరాలు ఆమె మాటల్లోనే…56వ డివిజన్ పాత 24 వ వార్డు నాకు ఓటు వేసి నన్ను ఆశీర్వదించిన ఓటరు మహాశయులకు నమస్కారాలు… కృతజ్ఞతలతో నా ఐదు సంవత్సరాల కౌన్సిల్ సమయంలో నేను మన 24 వ వార్డు 56వ డివిజన్ ను 36 వార్డులలో లేని విధంగా అభివృద్ధి చేసిన…
బీఫామ్ అందజేసిన డిసిసి అధ్యక్షురాలు దేవి ప్రసన్న, ఐవైసీ అధ్యక్షుడు చీకటి కార్తీక్ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో 15వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆకునూరి సుప్రియ బీఫామ్ అందుకుని ఎన్నికల బరిలోకి దిగారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సేవ చేయాలని సంకల్పంతో ముందుకు వస్తున్నానని ఆమె తెలిపారు. పరివర్తన అవాజ్ ,కొత్తగూడెం:-రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ నుంచి 15వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా ఆకునూరి సుప్రియ అధికారికంగా బీఫామ్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తమ డివిజన్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వార్డులో ప్రధానంగా మంచినీటి సరఫరా, రోడ్ల అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ, అవసరమైన సర్టిఫికెట్ల జారీ, కమ్యూనిటీ హాళ్ల సౌకర్యాల వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేస్తానని ఆమె తెలిపారు. ప్రజలకు అవసరమైన ప్రతి సేవను…
8 వార్డు మెంబర్ భుక్య అనూష ఫిర్యాదు చేసిన వెంటనే సమస్యకు పరిష్కారం పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-గ్రామాభివృద్ధి అంటే కేవలం కార్యాలయాల్లో కూర్చొని ఆదేశాలు ఇవ్వడం కాదని, ప్రజల మధ్యే ఉండి సమస్యలను ప్రత్యక్షంగా పరిష్కరించడమే అసలైన పాలన అని నంద తండా గ్రామపంచాయతీ సర్పంచ్ మాలోత్ బలరాం నిరూపిస్తున్నారు.అంబేద్కర్ నగర్ కాలనీ 8వ వార్డు అభ్యర్థి అనూష కాలనీలో ఉన్న సమస్యను సర్పంచ్ దృష్టికి తీసుకురాగానే, ఆలస్యం చేయకుండా అక్కడికి చేరుకుని తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టారు. సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు సిబ్బందితో కలిసి అక్కడే ఉండి పనులు పూర్తి చేయించడం సర్పంచ్ ప్రత్యేకతగా నిలిచింది. తాగునీటి ఇబ్బందులు, డ్రైనేజీ సమస్యలు, రోడ్ల మరమ్మతులు, వీధి దీపాల ఏర్పాటు, పారిశుధ్య పనులు, పంచాయతీ కార్యాలయానికి సంబంధించిన అంశాలు వంటి వాటిలో సర్పంచ్ మాలోత్ బలరాం ఎప్పటికప్పుడు చొరవ తీసుకుంటూ వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. గ్రామస్తులు సమస్య ఉందని చెప్పగానే…
– ఎన్నికల ప్రచారంలో బిజెపి అభ్యర్థి దేవులపల్లి విద్యసాగర్ పరివర్తన అవాజ్:-కొత్తగూడెం బిజెపి పార్టీ మద్దతుతో రాష్ట్ర నాయకులు జీవీకే మనోహర్ ఆశీస్సులతో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 58వ డివిజన్ లో పోటీ చేస్తున్న విద్యాసాగర్ కార్పొరేటర్ స్థానానికి తాను పోటీ చేస్తున్నానని ఒక్క అవకాశం ఇచ్చి గెలిపి స్తే మన 58వ డివిజన్ అభివృద్ధి చేస్తానని దేవులపల్లి విద్యసాగర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం తను పోటీ చేస్తున్న 58 వ డివిజన్ లో ఓటర్లను కలుసుకొని కమలం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. దివిజన్ లో నెలకొన్న సమస్యల పరిష్కారంతోపాటు ప్రభుత్వం నుండి మరిన్ని నిధులు తీసుకొచ్చి మున్సిపల్ కార్పొరేషన్ లో నెంబర్ వన్ డివిజన్ గ నిలబెడతానని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరితో స్నేహపూర్వకంగా ఉంటూ మీ అందరి సమస్యలు ఓపికగా తెలుసుకుని వాటిని కచ్చితంగా పరిష్కరిస్తానని రోడ్లు డ్రైనేజీ సమస్యలతో పాటు…
పరివర్తన అవాజ్:-చర్ల మరియు సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో నమోదవుతున్న జ్వర కేసుల నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి (DMHO) సంబంధిత సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో జ్వర కేసుల నియంత్రణపై పలు కీలక సూచనలు జారీ చేశారు. నమోదైన ప్రతి జ్వర కేసును ప్రతిరోజూ సర్వే చేసి పర్యవేక్షించాలని ఆదేశించారు. ఐఆర్‌ఎస్ స్ప్రేయింగ్ మరియు మలాథియన్ టెక్నికల్ ఫాగింగ్‌ను నాలుగు వారాల పాటు నిర్దిష్ట వ్యవధుల్లో నిర్వహించాలని సూచించారు.రోజువారీ జ్వర సర్వేలను సమగ్రంగా పర్యవేక్షించే బాధ్యత సూపర్వైజింగ్ అధికారికి (SUO) ఉంటుందని, స్ప్రేయింగ్ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు కావాలని తెలిపారు. ప్రతి గ్రామం మరియు ఇంటింటికీ చేరుకునేలా హెల్త్ క్యాంపులు నిర్వహించాలని ఆదేశించారు.ఏ గ్రామంలోనైనా ఒక్క జ్వర కేసు గుర్తించినా, ఆ గ్రామంలో మరిన్ని కేసులు రాకుండా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ప్రతి శుక్రవారం “డ్రై డే” కార్యక్రమాలను ఆశా కార్యకర్తలు తప్పనిసరిగా…
పకడ్బందీగా నిర్వహణ : జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ కార్యాలయం, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రాక్టికల్ పరీక్షలు సోమవారం నుండి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో ఏర్పాటు చేసిన వివిధ పరీక్షా కేంద్రాలలో ప్రాక్టికల్ పరీక్షలను ప్రశాంతంగా, పారదర్శకంగా, క్రమశిక్షణతో నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈరోజు నిర్వహించిన ప్రాక్టికల్ పరీక్షలలో ఉదయం సెషన్‌లో జనరల్ కోర్స్‌లో 974 మంది విద్యార్థులకు గాను 948 మంది హాజరుకాగా 26 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్ కోర్స్‌లో 1,381 మందికి గాను 1,324 మంది పరీక్షలకు హాజరుకాగా 57 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 2,365 మందికి గాను 2,182 మంది హాజరై 83 మంది గైర్హాజరయ్యారు. అలాగే మధ్యాహ్నం సెషన్‌లో జనరల్ కోర్స్‌లో 703 మందికి గాను 685 మంది హాజరై 17 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్ కోర్స్‌లో…
పరివర్తన అవాజ్, కొత్తగూడెం:-విద్యానగర్ కాలనీ చింతలచెరువు సమీపంలో ఉన్న బతుకమ్మ ఘాటు వద్ద మరియు దాని చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ శాంతి శ్రీ, ఉపసర్పంచ్ వాసిరెడ్డి మురళి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా సాగింది. ఈ సందర్భంగా ఘాటు ప్రాంతంలో పేరుకుపోయిన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర అనవసర పదార్థాలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. బతుకమ్మ పండుగ సమయంలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చే నేపథ్యంలో పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సర్పంచ్ శాంతి శ్రీ మాట్లాడుతూ గ్రామ పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రజలు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా సహకరించాలని కోరారు. ఉపసర్పంచ్ వాసిరెడ్డి మురళి మాట్లాడుతూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. ఈ శుభ్రత కార్యక్రమంలో గ్రామపంచాయతీ సభ్యులు, పారిశుధ్య సిబ్బంది, స్థానికులు పాల్గొని…
కేంద్ర ప్రభుత్వం పేదలకు విద్యను దూరం చేసే కుట్ర. ఏఐఎస్ఎఫ్ జిల్లా ఆద్యక్ష కార్యదర్సులు:SK షాహిద్ వరక అజిత్ పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ యందు ప్రవేశపెట్టిన2026-2027 వార్షిక బడ్జెట్ లో విద్యా రంగానికి అన్యాయం చేస్తున్నది. 12 ఏళ్ల మోడీపాలనలో విద్యా రంగానికి కేటాయింపులు తగినమొత్తంలో జరగటంలేదు. ఈ సంవత్సరం 53.5 లక్షల కోట్ల మొత్తం బడ్జెట్లో విద్యకు కేటాయించిన నిధులు కేవలం 1,39,289 కోట్లు. ఇది మొత్తం బడ్జెట్లో 2.6 శాతం మాత్రమే! ఈ నిధులు పెరిగినట్లు కనిపించినప్పటికీ మొత్తం బడ్జెట్ లో శాతంలో పెరుగుదల లేదు. కేంద్ర బడ్జెట్ లో కనీసం 10%, జిడిపిలో 6శాతం నిధులు కేటాయించాలని అనేక సంవత్సరాలుగా విద్యావేత్తలు, మేధావులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నా కూడా ప్రభుత్వం కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు.తెలంగాణ విభజన హామీ చట్టంలో ఉన్న విద్యాసంస్థలను కేటాయించకుండా, రాష్ట్రానికి ప్రత్యేక నిధులు కేటాయించకుండా అడుగడుగునా మొండి వైఖరిని…
సేవ చేయడం లో తనకు తానే సాటి డివిజన్ అభివృద్ధి నా లక్ష్యం.. ఎమూనూరి శివకృష్ణ పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం కొత్తగూడెం మున్సిపాలిటీ 58వ డివిజన్ బి.ఆర్.యస్ పార్టీ అభ్యర్ధిగా ఎమూనూరి శివకృష్ణ మి ముందుకు వస్తున్నారు ప్రియమైన డివిజన్ ప్రజలారా ఆదరించండి అభిమానించండి మీ అందరి ఆప్త బంధువు,సేవతాత్పరుడు,నీతి నిజాయితీకి నిలువెత్తు రూపం సేవ చేయడంలో అంకితభావంతో ముందు ఉండే వారు ఏమి పదవి లేకపోయినా కూడా అనేక సేవా కార్యక్రమాలు చేసిన ఘనత శివకృష్ణ కి దక్కింది కార్పొరేటర్ గా గెలిస్తే మి డివిజన్ అభివృద్ధికి పాటుపడతాడు అధికారులను నిలదీసే దమ్మున్న నాయకుడు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి వారి కష్టాల్లో పాలుపనుచుకునే వారు ప్రజల మధ్య ప్రేమ కలిగిన వారు మన శివకృష్ణ ఈ కార్యక్రమములో శివకృష్ణ మాట్లాడుతూ అధికారం లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం మాటలకు మాత్రమే పరిమితం అయ్యింది…
సమస్యలతో పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు న్యాయం చేకూరుతుందనే భరోసా కల్పించాలి* పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పరివర్తన అవాజ్, కొత్తగూడెం:-జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్ను సోమవారం ఆకస్మికంగా సందర్శించడం జరిగింది.ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.5S అమలులో భాగంగా పోలీస్ స్టేషన్ రికార్డులను ఒక క్రమ పద్దతిలో అమర్చుకోవాలని అన్నారు.అనంతరం పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించి,పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.వర్టికల్స్ వారీగా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించే అధికారులు,సిబ్బంది పనితీరును పరిశీలించారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని అధికారులు,సిబ్బందికి పలు సూచనలు చేశారు.డయల్ 100 ఫోన్ రాగానే స్పందించి ఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు న్యాయం చేకూర్చాలని సూచించారు.పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రమాద నివారణా చర్యలు చేపట్టాలని…
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.