Author: laxman RAO

పరివర్తన అవాజ్,కొత్తగూడెం:- జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్.*మహనీయులు ప్రతిపాదించిన ఆశయాలు, సిద్ధాంతాలే సామాజిక న్యాయం సాధించేందుకు మార్గదర్శకాలని జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ అన్నారు. తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతిపిత మహాత్మ గాంధీ, భారత రాజ్యాంగ నిర్మాత డా|| బి.ఆర్. అంబేద్కర్, మహాత్మ జ్యోతిరావు ఫూలే చిత్రపటాలకు జిల్లా అదనపు కలెక్టర్ పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ రంగాలలో సమానత్వం సాధించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎంతో కీలకమని అన్నారు. కుల సర్వే నిర్వహణతో పాటు షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణ దిశగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సమాజంలోని వెనుకబడిన చివరి వ్యక్తికీ తగిన వనరులు,…

Read More

చేయి గుర్తుపై ఓటు వేసి విశ్వనాధ్‌ను గెలిపించాలని పిలుపు పరివర్తన ఆవాజ్,కొత్తగూడెం టౌన్:-రామవరం 14వ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రతి వీధి, ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గతంలో కాంగ్రెస్ పాలనలో అమలైన ప్రజా సంక్షేమ పథకాలు పేద, మధ్యతరగతి వర్గాలకు ఎంతగానో ఉపయోగపడ్డాయని తెలిపారు. ప్రస్తుతం స్థానికంగా నెలకొన్న మౌలిక వసతుల సమస్యలు — తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుధ్యం వంటి అంశాలను పరిష్కరించాలంటే ప్రజలతో నిత్యం మమేకమై ఉండే నాయకుడు అవసరమని పేర్కొన్నారు.అలాంటి నాయకుడిగా విశ్వనాధ్ ప్రజల నమ్మకాన్ని సంపాదించుకున్నారని, ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటూ సమస్యల పరిష్కారానికి పోరాడే వ్యక్తి అని కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడ్డారు. రామవరం 14వ డివిజన్‌ను అభివృద్ధి పథంలో నడిపించగల సత్తా…

Read More

పరివర్తన అవాజ్, కొత్తగూడెం:-కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 27వ డివిజన్‌లో సీపీఐ పార్టీ కార్యకలాపాలు వేగవంతమవుతున్నాయి. ఈ సందర్భంగా 27వ డివిజన్ ఇన్‌చార్జ్‌లుగా ఉన్న ఎక్స్-ఎంపీటీసీ దుర్గరాశి వెంకన్న మరియు ఎక్స్-ఎంపీపీ దుర్గరాశి లక్ష్మి ఆధ్వర్యంలో ఈరోజు సీపీఐ పార్టీ రాష్ట్ర నాయకుడు ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు చేతుల మీదుగా కార్పొరేటర్ అభ్యర్థి మద్దాల హరితకు బీ-ఫారం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ, 27వ డివిజన్ అభివృద్ధి కోసం మద్దాల హరిత కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలు అందరూ మద్దాల హరితను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అలాగే సీపీఐ పార్టీ ఎన్నికల గుర్తు అయిన కంకి-కొడవలి గుర్తుకు ఓటు వేసి విజయాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Read More

పరివర్తన అవాజ్ ,కొత్తగూడెం :-జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాలతో కొత్తగూడెం డిఎస్పి ఆదినారాయణ సూచనలతో కొత్తగూడెం త్రీ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం పోలీస్ స్టేషన్ పరిధిలోని గంజాయి హాట్స్పాట్స్ తనిఖీలు నిర్వహించారు.కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి హాట్స్పాట్స్ గా గుర్తించబడిన ప్రదేశాలలో ఈ తనిఖీలు చేపట్టడం జరిగిందని త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి తెలిపారు.ఈ తనిఖీలను నిర్వహించడం కోసం మత్తు పదార్థాలను కనిపెట్టే పోలీస్ జాగిలాలను ఉపయోగించడం జరిగిందని వివరించారు.ఎవరైనా గంజాయి సరఫరా చేస్తున్నట్లుగానీ, అక్రమ రవాణా చేస్తున్నట్లుగానీ,సేవిస్తున్నట్లుగానీ తెలిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని సీఐ కోరారు.

Read More

పరివర్తన అవాజ్:-కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో 18వ డివిజన్‌లో రాజకీయ ఉత్సాహం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ తరఫున 18వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా మాతంగి దివ్యకు పార్టీ అధిష్టానం అధికారికంగా బీఫామ్ అందజేసింది. ఈ బీఫామ్‌ను డిసిసి అధ్యక్షురాలు దేవి ప్రసన్న మరియు ఐవైసీ అధ్యక్షుడు చీకటి కార్తీక్ అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాతంగి దివ్యకు బీఫామ్ అందజేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తానని తెలిపారు. 18వ డివిజన్‌లో ఉన్న ప్రతి ప్రజా సమస్యను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని ఆమె హామీ ఇచ్చారు. డివిజన్ పరిధిలో తాగునీటి సమస్య, రోడ్ల అభివృద్ధి, డ్రైనేజీ వ్యవస్థ, శానిటేషన్, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని దివ్య వెల్లడించారు. ప్రజలకు అందుబాటులో…

Read More

– ఎంఎల్ఎ కూనంనేని సాంబశివరావు.- అభ్యర్ధులకు బి ఫారాలు అందజేత పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-కొత్తగూడెం కార్పోరేషన్పై ఎర్రజెండా ఎగరాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్ఎకూనంనేని సాంబశివరావు అన్నారు. కార్పోరేషన్ ఎన్నికలకు సంబందించి బరిలో ఉన్న అభ్యర్థులకు స్థానిక శేషగిరి భవన్ సిపిఐ కార్యాలయం లో ఆయన మంగళవారం బి ఫారాలను అందజేశారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ ఈనెల 11న జరగనున్న కొత్తగూడెం కార్పోరేషన్ ఎన్నికల్లో భాగంగా సిపిఐ తన అభ్యర్థులను ప్రకటించిందని, టిడిపి, ప్రజా సంఘాల మద్దతుతో భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) ప్రజాక్షేత్రంలోకి వెళుతుందని చెప్పారు. సిపిఐ బలపరిచిన అభ్యర్ధుల విజయానికి ప్రతీ కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని, విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వూర్తిగా పార్టీ కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగానే కొత్తగూడెం కార్పోరేషన్ వ్యాప్తంగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల ముఖ్యమంత్రి, మంత్రులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నామనే భావన వద్దని, స్థానిక పరిస్థితులు, రాజకీయ సమీకరణాల్లో భాగంగానే ఈ…

Read More

  జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు. పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-జిల్లాలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ వార్షిక ప్రయోగ పరీక్షలను పకడ్బందీగా, నిబంధనల ప్రకారం నిర్వహించాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు సజావుగా కొనసాగుతున్న నేపథ్యంలో మంగళవారం ఆయన ములకలపల్లి, అశ్వరావుపేట మండలాల్లోని పలు జూనియర్ కళాశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ములకలపల్లి మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి ప్రయోగ పరీక్షల నిర్వహణ విధానం, ప్రయోగశాలల ఏర్పాట్లు, విద్యార్థుల హాజరు నమోదు, ప్రశ్నపత్రాల భద్రత తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు. అనంతరం అశ్వరావుపేట మండలంలోని ఒక ప్రైవేట్ జూనియర్ కళాశాలను కూడా తనిఖీ చేసి పరీక్షలు నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్నారా లేదా అన్న విషయాన్ని పరిశీలించారు.   రెండవ రోజు నిర్వహించిన ప్రయోగ పరీక్షల హాజరు వివరాలను సమీక్షించిన జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి, ఉదయం నిర్వహించిన పరీక్షలలో సాధారణ…

Read More

పరివర్తన అవాజ్ ,కొత్తగూడెం: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో 58వ డివిజన్‌లో రాజకీయ వేడి మరింత పెరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున 58వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా ఎండి దావూద్‌కు పార్టీ బీఫామ్ అందజేశారు. ఈ బీఫామ్‌ను డీసీసీ అధ్యక్షురాలు దేవి ప్రసన్న, ఐవైసీ అధ్యక్షుడు చీకటి కార్తీక్ అందజేశారు. ఈ సందర్భంగా ఎండి దావూద్ మాట్లాడుతూ, 58వ డివిజన్ ప్రజల ఆశీస్సులతో తాను కార్పొరేటర్‌గా గెలిస్తే డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ప్రజలకు అత్యవసరమైన తాగునీరు, రోడ్లు, కరెంట్, శానిటేషన్ వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. అలాగే ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లు మరియు ఇతర సేవలు సులభంగా అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. డివిజన్ ప్రజలు తనపై నమ్మకం ఉంచి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎండి దావూద్ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని అభ్యర్థికి మద్దతు…

Read More

  బీఫామ్ అందజేసిన డిసిసి అధ్యక్షురాలు దేవి ప్రసన్న , ఐవైసి అధ్యక్షుడు చీకటి కార్తీక్ పరివర్తన అవాజ్ :-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి పనిచేస్తున్న కరుడుగట్టిన కార్యకర్త బానోతు కోటేష్‌కు పార్టీ ఉన్నత స్థాయి నుంచి గౌరవం లభించింది. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 20వ డివిజన్‌కు సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్త బానోతు కోటేష్‌కు డిసిసి అధ్యక్షురాలు దేవి ప్రసన్న, ఐవైసీ అధ్యక్షుడు చీకటి కార్తీక్ చేతుల మీదుగా బీఫామ్ అందజేశారూ.ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ, తాను ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నానని తెలిపారు. పార్టీ చేపట్టిన ప్రతి కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటూ ప్రజల మధ్య పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా ప్రచారం చేస్తూ ముందుకు సాగుతున్నానన్నారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల…

Read More

పరివర్తన ఆవాస్,కొత్తగూడెం:-పట్టణంలో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేసే దిశగా విద్యానగర్ కాలనీ బైపాస్ రోడ్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కొత్తగూడెం డీఎస్పీ ఎల్. ఆదినారాయణ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడగా, పోలీస్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు మరియు వాహనదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చుంచుపల్లి సీఐ ఆర్. వెంకటేశ్వరావు, వన్ టౌన్ సీఐ కరుణాకర్, 3 టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, 2 టౌన్ సీఐ ప్రతాప్, చుంచుపల్లి ఎస్‌హెచ్‌ఓ రవి కుమార్, ఎస్సై ఉమా, కానిస్టేబుల్స్ రవి, పూజారి రమేష్ బాబు పాల్గొన్నారు. అలాగే ఎంఎస్ పాన్ మహల్ ప్రొప్రైటర్ గులాం మతీన్ మరియు స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ ఆదినారాయణ మాట్లాడుతూ, సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల నేర నియంత్రణలో కీలక మార్పులు వస్తాయని తెలిపారు. ప్రమాదాలు లేదా ఇతర నేర సంఘటనలు జరిగిన వెంటనే నేరస్తులను…

Read More