Author: laxman RAO
పరివర్తన ఆవాజ్ కొత్తగూడెం:-నాగర్ కర్నూల్ జిల్లా, కుమ్మెర గ్రామంలో 2026 ఫిబ్రవరి 18న జరిగిన మల్లన్న జాతరలో సిలికేశ్వరం గణేష్, తల్లి చంద్రకళ , భార్య మౌనిక, అక్క కీర్తి దైవ దర్శనం కోసం వెళ్లారు. వీరిని కులం పేరుతో దూషించి, దౌర్జన్యం, దాడి చేసి గణేష్ యొక్క 2నెలల పసి బిడ్డను ఆ గ్రామ అగ్రకుల పెత్తందారులు కులం పేరుతో దూషించి, దౌర్జన్యం, దాడిచేసి మానవమృగాల్లా ప్రవర్తించి, 2 నెలల పసిబిడ్డను హత్య చేశారు. ఈ ఘటన కు బాధ్యులైన వ్యక్తులను, కేసు జాప్యం చేస్తున్న పోలీసుల పై కఠిన చర్యలు తీసుకోవాలని cpm భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళలని కూడా చూడకుండా, నానా బూతులు తిట్టి అవమానించారు. ఇదేమిటని సోషల్ మీడియాలో ప్రశ్నించిన గణేష్‌ను మూడున్నర గంటల పాటు పైన పేర్కొన్న పెత్తందారులు ఒక గదిలో నిర్భంధించి చితకబాదారు. తన…
పరివర్తన అవాజ్ కొత్తగూడెం:-భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చుంచుపల్లి బైపాస్,మెయిన్ రోడ్ రోడ్డుపై నెంబర్ ప్లేట్లు లేకుండా భారీ వాహనాలు బూడిదను విడుదల చేసుకుంటూ ప్రమాదకర రీతిలో ప్రయాణించడం ఆందోళన కలిగిస్తోంది. లారీలలో సరైన కవర్లు లేకుండా బూడిదను తరలించడం వల్ల గాలిలో బూడిద జల్లుకుంటూ వెనుక వచ్చే వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. కొన్ని లారీలు అతివేగంగా నడుస్తూ, లోడును సరిగా కట్టకుండా తీసుకెళ్లడం వల్ల ఎప్పుడు పడిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దాంతో ద్విచక్ర వాహనదారులు, కార్లలో ప్రయాణించే వారు భయాందోళనకు గురవుతున్నారు. బూడిద కళ్లలో పడటం, రోడ్డు స్పష్టంగా కనిపించకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల కొన్ని సందర్భాల్లో లారీలు రహదారిపై బూడిద చల్లడంతో వెనుక వస్తున్న వాహనాలు స్కిడ్ అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయని వాహనదారులు పేర్కొన్నారు. నెంబర్ ప్లేట్లు లేకుండా ప్రయాణించడం చట్టవిరుద్ధమని, ఇటువంటి వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు…
పరివర్తన అవాజ్ కొత్తగూడెం, ఫిబ్రవరి 26: రాష్ట్రవ్యాప్తంగా నేడు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు ఉదయం నుంచే హాజరై పరీక్షలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్తగూడెం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ పరీక్షా కేంద్రాన్ని కొత్తగూడెం వన్ టౌన్ ఎస్ఐ రాకేష్ సందర్శించారు. పరీక్షల నిర్వహణపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించి, కేంద్రం వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. పరీక్షా కేంద్రం పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున అనవసరంగా గుమికూడవద్దని, విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి సహకరించాలని ఎస్ఐ రాకేష్ కోరారు. తల్లిదండ్రులు కూడా పరీక్షా కేంద్రాల వద్ద గుమికూడకుండా దూరం పాటించాలని సూచించారు. పరీక్షలు సజావుగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా కొనసాగుతున్నాయని కేంద్ర నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు…
ఏజెన్సీ ఎస్సీ రిజర్వేషన్ పెంపు పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ -మోదుగు జోగారావు పరివర్తన అవాజ్ కొత్తగూడెం: కొత్తగూడెం వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ పదవిని ఎస్సీలకు కేటాయించాలని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మోదుగు జోగారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఏజెన్సీ ప్రాంతాల్లో ఎస్సీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఎస్సీల ఓట్లను దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత, అదే ఏజెన్సీ ప్రాంతంలో ఎస్సీలు లేరన్నట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఏజెన్సీ రిజర్వేషన్ పెంపు అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించాలన్నారు. ఇప్పటికైనా ఎస్సీ వర్గాలకు న్యాయం చేసి, నామినేట్ పదవుల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా కొత్తగూడెం వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ పదవిని ఎస్సీలకు కేటాయించాలని స్పష్టం చేశారు. లేనిపక్షంలో ఎస్సీ వర్గాల హక్కుల కోసం ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని…
ఆందోళనలో కాంగ్రెస్ ఆశావాలు…? పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెంలో రాజకీయ వేడి మళ్లీ పెరుగుతోంది. వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో లోపలే తీవ్ర పోటీ నెలకొనడంతో స్థానిక రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారాయి. పార్టీ కష్టకాలంలో వీధివీధి తిరిగి జెండాలు మోసిన వారు, అరెస్టులు ఎదుర్కొన్న వారు, ఎన్నికల సమయంలో భుజాలు కాయలయ్యేలా శ్రమించిన కార్యకర్తలు ఇప్పుడు ఒక్క మాటే అంటున్నారు — “ఈసారి అయినా మా కష్టానికి గుర్తింపు దక్కాలి.” ఎన్నికల సమయంలో పార్టీ కోసం రాత్రింబవళ్లు కష్టపడిన కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టులు మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నాయనే అసంతృప్తి బహిరంగంగానే వినిపిస్తోంది. గతంలోనూ పలుమార్లు ఆశలు పెంచి చివరికి నిరాశ మిగిల్చిన సందర్భాలు ఉండటంతో ఈసారి నిర్ణయం ఎలా ఉంటుందన్నదే హాట్ టాపిక్‌గా మారింది. స్థానికంగా సీనియర్ నాయకులు, యువ ఆశావాహులు, సామాజిక వర్గాల సమీకరణలతో పలువురు పేర్లు చైర్మన్ రేసులో…
పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 17వ డివిజన్ పరిధిలోని రామవరం ప్రాంతంలో తాగునీటి సమస్య తీవ్రంగా మారిందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు మోరే రమేష్ కుమార్ ఆరోపించారు. గత ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన రాష్ట్ర ప్రభుత్వ మిషన్ భగీరథ పథకం కింద దాదాపు రూ.3 కోట్లతో, అలాగే కేంద్ర ప్రభుత్వ జల్ యోజన పథకం కింద రూ.8 కోట్ల వ్యయంతో ఎనిమిది లక్షల లీటర్ల సామర్థ్యం గల భారీ వాటర్ ట్యాంక్ నిర్మించినప్పటికీ, ఇప్పటివరకు ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగి 28 నెలలు గడిచినా, రామవరం పరిధిలోని దాదాపు ఆరు డివిజన్ల ప్రజలకు సరైన మంచినీటి సౌకర్యం లేకపోవడం విచారకరమని అన్నారు. ముఖ్యంగా వేసవికాలం ప్రారంభమైన ఈ సమయంలో కూడా పూర్తయిన వాటర్ ట్యాంకులను ప్రారంభించకుండా పైపులైన్ల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం రామవరం ప్రజలు తీవ్రమైన…
–తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ అధ్యక్షులు లక్కినేని సత్యనారాయాణ పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్, తెలంగాణ రాష్ట్రం అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ మరియు జనరల్ సెక్రటరీ నవూరి అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ, రంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్‌కు చెందిన న్యాయవాది శ్రీ మహమ్మద్ ఖదీర్ గారి దారుణ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటన న్యాయవృత్తి గౌరవానికి, న్యాయపాలనకు, న్యాయవ్యవస్థకు నేరుగా జరిగిన దాడిగా పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 16-02-2026 సోమవారం నాడు న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించాలని ఫెడరేషన్ నిర్ణయించినట్లు తెలిపారు. అదే రోజు ఉదయం 10:30 గంటలకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని బార్ అసోసియేషన్లలో సంతాప సమావేశాలు నిర్వహించబడతాయని చెప్పారు. అనంతరం నల్ల బ్యాడ్జీలు ధరించి కోర్టు ప్రధాన ద్వారాల ముందు శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపట్టి, అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేస్తామని పేర్కొన్నారు.ప్రభుత్వం వెంటనే నిందితులను అరెస్ట్ చేసి,…
పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-రామవరం జమ మస్జీద్ లో మసీదు కమిటీ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసం స్వాగత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఫ్తీ అబ్దుల్ మతీన్ మాట్లాడుతూ రంజాన్ మాసం ఉపవాసాల ద్వారా మనిషిలోని చెడు లక్షణాలను తొలగించి మానవతా విలువలను పెంపొందించే పవిత్ర కాలమని తెలిపారు. కల్మషం, కపటం, స్వార్థాన్ని విడిచి నిండు హృదయంతో రంజాన్‌ను ఆహ్వానించాలని కోరారు.మౌలానా ఇర్ఫాన్ కూడా మాట్లాడుతూ ఈ మాసం ఆధ్యాత్మిక శుద్ధికి మార్గదర్శకమని చెప్పారు. షేఖ్ అబ్దుల్ బాసిత్ మాట్లాడుతూ మానవాళికి మార్గనిర్దేశం చేసే ఖురాన్ అవతరణ జరిగిన మాసమిదని, దాని బోధనలను అనుసరిస్తూ సమాజంలో శాంతి, సామరస్యాలను పెంపొందించాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో మసీదు అధ్యక్షుడు ఖమర్, కార్యదర్శి గౌస్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
-మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో చేరిక పరివర్తన అవాజ్,కొత్తగూడెం కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా విజయం సాధించిన ఐదుగురు కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఖమ్మంలోని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. మంత్రి పొంగులేటి సమక్షంలో వీరంతా కాంగ్రెస్ పార్టీలో చేరగా, వారికి మంత్రి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో 1వ డివిజన్ కార్పొరేటర్ సీరపు సుగుణ, 13వ డివిజన్ కార్పొరేటర్ తలుగు శాంతా, 34వ డివిజన్ కార్పొరేటర్ బట్టు విజయలక్ష్మి, 42వ డివిజన్ కార్పొరేటర్ దున్నపోతుల మణి, 48వ డివిజన్ కార్పొరేటర్ ధర్మసోత్ నరేష్ ఉన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై తాము కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ…
మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు చదలవాడ సూరి పరివర్తన అవాజ్,కొత్తగూడెంభద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో జరిగిన కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సిపిఐ, కాంగ్రెస్ పొత్తుతో మేయర్ పదవి సిపిఐ కైవసం చెసుకుంటుందని మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు చదలవాడ సూరి అన్నారు. ఈ నేపథ్యంలో సామాజిక సమతుల్యత కోసం డిప్యూటీ మేయర్ పదవిని కాంగ్రెస్ పార్టీ ఎస్సీలకు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్లో అన్ని వర్గాలకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వడం ప్రజాస్వామ్యానికి అవసరమని సూరి పేర్కొన్నారు.
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.