Author: laxman RAO

పరివర్తన అవాజ్,కొత్తగూడెం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ప్రకాశం స్టేడియంలో ఘనంగా ముగ్గుల పోటీలు ప్రారంభమయ్యాయి. సంప్రదాయ సంస్కృతి ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. ఈ ముగ్గుల పోటీల ప్రారంభ కార్యక్రమంలో పార్టీ నాయకులు, పార్టీ పెద్దలు, కార్యకర్తలు పాల్గొని మహిళలను ప్రోత్సహించారు. ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో హాజరై రంగురంగుల ముగ్గులతో స్టేడియాన్ని కళకళలాడించారు.

Read More

    పరివర్తన అవాజ్,కొత్తగూడెం  కొత్తగూడెం క్లబ్బులో గిరిజన లంబాడి సంఘాల జిఎల్ఎస్ (GLS) ఆధ్వర్యంలో నంద తండా గ్రామ సర్పంచ్ బలరాం మరియు ఉపసర్పంచ్ మంగమ్మ (W/o చిన్నా) లకు ఘనంగా సన్మాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. గ్రామాభివృద్ధి, గిరిజనుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రజాప్రతినిధుల సేవలను గుర్తిస్తూ జిఎల్ఎస్ సంఘాల ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ బలరాం, ఉపసర్పంచ్ మంగమ్మలను శాలువాలతో సత్కరించి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ గిరిజన తండాల అభివృద్ధిలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. విద్య, రహదారులు, తాగునీరు, సంక్షేమ పథకాల అమలులో సర్పంచ్–ఉపసర్పంచ్‌లు సమన్వయంతో పనిచేయడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ గిరిజన సంఘాల నాయకులు, అధికారులు, పలు రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా మహిళలు అధిక…

Read More

మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి: కాంగ్రెస్ నేతల పిలుపు పరివర్తన అవాజ్ ,కొత్తగూడెం ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రివర్యులు గౌ. శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి మరియు ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామా సహాయం రఘురాం రెడ్డి ఆధ్వర్యంలో కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో నిర్వహించనున్న ముగ్గుల పోటీలను ప్రతి మహిళ పాల్గొని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.ఈ మేరకు ఆదివారం కొత్తగూడెం బూడిదగడ్డలోని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కనుకుంట్ల కుమార్ నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ముగ్గుల పోటీ పోస్టర్లను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు తూము చౌదరి, కనుకుంట్ల కుమార్ మాట్లాడుతూ మహిళల భాగస్వామ్యంతోనే ఈ కార్యక్రమం మరింత వైభవంగా సాగుతుందని తెలిపారు.అదేవిధంగా రాబోయే కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన విధానాలపై కాంగ్రెస్ నేతలతో విస్తృతంగా చర్చించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్…

Read More

డీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తోట దేవిప్రసన్న మర్యాద పూర్వకంగా కలిసిన ఎ.ఐ.సి.సి నేషనల్ కోఆర్డినేటర్ కొత్తగూడెం జనవరి 11 : కాంగ్రెస్‌ పార్టీ డిసిసి అధ్యక్షురాలిగా నియమితులైన తోట దేవిప్రసన్నను ఎ.ఐ.సి.సి నేషనల్ కోఆర్డినేటర్ ఎల్.కృష్ణ ఆదివారం స్థానిక బస్టాండ్ సమీపంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయం లో మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. తరువాత జిల్లా పార్టీ అభివృద్ధి, కార్యకర్తల సమీకరణ, రాబోయే ఎన్నికల కార్యక్రమాల ప్రణాళిక పై చర్చించారు. ఈ సందర్భంగా దేవిప్రసన్న మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తన పై ఉంచిన విశ్వాసానికి పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు కళ్లెం కోటి రెడ్డి, ఏనుగుల అర్జున్ రావు, ఎం.డి ఖజా గౌస్ మొయినుద్దీన్, సుజాతనగర్ శేఖర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Read More