Author: laxman RAO

ఈ రంగ వల్లులు ఆడ బిడ్డల కళారూపాలు బహుమతులు ప్రధానం చేసిన ఎంఎల్ఏ పరివర్తన అవాజ్, కొత్తగూడెం చక్కగా చూడముచ్చటి రంగులతో వేసిన ఈ ముగ్గులు ఆడ బిడ్డల కళారూపాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి,ఎంఎల్ఎ కూనంనేని సాంబశివరావు అన్నారు. స్థానిక శేషగిరి భవన్, సిపిఐ కార్యాలయంలో రోడ్, 7 నెంబర్ బజార్, పంజాబ్ గడ్డ ఏరియాల్లో సిపిఐ ఆధ్వర్యంలో సంక్రాంతిని పురస్కరించుకుని ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలో విజేతలుగా నిలిచిన వారికి కూనంనేని బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఏటా సంక్రాంతి వర్వదినాన్ని పురస్కరించుకుని ముగ్గుల పోటీలు సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ ముగ్గుల పోటీలో గెలుపు ఓటములు సహజమని, ముగ్గుల వేసిన ప్రతీ ఒక్కరికీ బహుమతులు రావడం సాధ్యం కాదని, ముగ్గులో ఉన్న కళారూపాన్ని, రంగుల అమరిక, పండుగ శోభ ఉట్టి పడేలా వేసిన ముగ్గులను న్యాయ నిర్ణేతలు…

Read More

  పరివర్తన అవాజ్,కొత్తగూడెం సంక్రాంతి, కనుమ పండుగలను పురస్కరించుకుని జిల్లా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ బుధవారం ఒక ప్రకటనలో హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.తెలుగువారి అతిపెద్ద పండుగ అయిన సంక్రాంతి ప్రతి ఇంటిలో సిరిసంపదలు, ఆయురారోగ్యాలు నింపాలని ఆయన ఆకాంక్షించారు. ప్రకృతిని ప్రేమించే, రైతన్నను గౌరవించే గొప్ప పండుగగా సంక్రాంతి నిలుస్తుందని పేర్కొన్నారు. పంట చేతికి వచ్చిన ఆనందంతో రైతులు జరుపుకునే ఈ పండుగ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మరింత పునరుత్తేజాన్ని అందించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.కొత్త ఆశలు, కొత్త వెలుగులతో ప్రజలు తమ జీవితాలను ప్రారంభించుకోవాలని, కొత్త సంవత్సరంలో జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో, సమృద్ధిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు.

Read More

    పాల్గొన్న సర్పంచ్ ఉప సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్లు పరివర్తన అవాజ్,కొత్తగూడెం నంద తండా గ్రామపంచాయతీలో సంక్రాంతి పండుగను ఈపురస్కరించుకొని నిర్వహించిన ముగ్గుల పోటీలు ఘనంగా విజయవంతమయ్యాయి. గ్రామంలోని మహిళలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల ముగ్గులతో పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ ముగ్గులు వేసిన మహిళలను ఎంపిక చేసి గ్రామపంచాయతీ సర్పంచ్ మాలోత్ బలరాం మరియు ఉపసర్పంచ్ మంగమ్మ గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. మహిళల ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పోటీలను నిర్వహించినట్లు వారు తెలిపారు. గ్రామంలో మహిళల భాగస్వామ్యంతో ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పలువురు గ్రామస్తులు ప్రశంసించారు. ఈ కార్యక్రమం గ్రామంలో పండుగ సందడిని మరింత పెంచిందని పాల్గొన్న మహిళలు ఆనందం వ్యక్తం చేశారు.  

Read More

సమస్యలపై పోరాటం వాటి పరిష్కారమే సిపిఐ ధ్యేయం వందేళ్ల స్పూర్తితో బలమైన ఉద్యమాలు  సిపిఐ శత వసంత ఉత్సవ ముగింపు సభను జయప్రథం చేయండిఖమ్మంలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ పరివర్తన అవాజ్ ,కొత్తగూడెం సిపిఐ శత వసంతాల సాక్షిగా సమస్యలపై పోరాటం, వాటి పరిష్కారమే ధ్యేయంగా మరో వందేళ్లు కూడా ముందుకుసాగుదామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం కార్పోరేషన్ కార్యదర్శులు, పట్టణ కార్యవర్గ, కౌన్సిల్ సభ్యులు, మాజీ కౌన్సిలర్ల అత్యవసర సమావేశం స్థానిక శేషగిరి భవన్, సిపిఐ కార్యాలయంలో బుధవారం జరిగింది. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ దేశ స్వతంత్రానికంటే ముందే భారత గడ్డపై ఆవిర్భవించిన సిపిబ వందేళ్లు పూర్తి చేసుకుందన్నారు. బ్రిటీష్ బానిస సంకెళ్ల నుండి దేశాన్ని విముక్తి చేసేందుకు సిపిఐ రాజీలేని పోరాటం చేసిందని, ఈ మహా సంగ్రామంలో ఎందరో కమ్యూనిస్టు యువకిశోరాలు రక్త తర్పణం చేశారని…

Read More

  వివరాలు వెల్లడించిన డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ పరివర్తన అవాజ్,కొత్తగూడెం కొత్తగూడెం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నిషేధిత మత్తుపదార్థాల అక్రమ రవాణాపై పోలీసులు దృష్టి సారించారు. ఈ క్రమంలో ఎవరికి అనుమానం రాకుండా తరలిస్తున్న లిక్విడ్ గంజాయిని వన్‌టౌన్ పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయాలను కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ మంగళవారం వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం… మంగళవారం మధ్యాహ్నం సుమారు 12.30 గంటల సమయంలో వన్‌టౌన్ సీఐ శివప్రసాద్‌కు విశ్వసనీయ సమాచారం అందింది. వెంటనే సిబ్బందితో కలిసి పోస్ట్ ఆఫీస్ సెంటర్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో టీవీఎస్ జూపిటర్ స్కూటీపై వస్తున్న ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని ఆపి తనిఖీ చేయగా, వారి వద్ద నిషేధిత గంజాయితో తయారుచేసిన హాషిష్ ఆయిల్ (లిక్విడ్ గంజాయి) 3 కిలోలు లభ్యమైంది. దీని అంచనా మార్కెట్ విలువ సుమారు రూ.15 లక్షలుగా పోలీసులు తెలిపారు. అరెస్టయిన…

Read More

జన “నినాదం”మై వినిపించాలి…ప్రజాస్వరం మరింత బలపడాలిజిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరివర్తన అవాజ్,కొత్తగూడెంప్రజల సమస్యలు, ఆశలు, ఆకాంక్షలకు అద్దం పట్టేలా జన “నినాదం”మై వినిపించాలని, ప్రజా సమస్యల పరిష్కార సంకల్పంతో నడుస్తున్న నినాదం తెలుగు దినపత్రిక క్యాలెండర్‌ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ జల్ది శామ్ ఆధ్వర్యంలో నిర్వహించగా, కలెక్టర్ క్యాలెండర్‌ను ఆవిష్కరించి నినాదం పత్రిక బృందానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని, ముఖ్యంగా ప్రజల నినాదాన్ని అధికార వ్యవస్థల దృష్టికి తీసుకువెళ్లడంలో నిష్పక్షపాత జర్నలిజం అవసరం ఎంతో ఉందని పేర్కొన్నారు. నినాదం పత్రిక ప్రజాసమస్యలపై నిరంతరం స్పందిస్తూ, బాధ్యతాయుత పాత్ర పోషించడం అభినందనీయమన్నారు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నినాదం పత్రిక ప్రజాసేవా ప్రయాణంలో మరో మైలురాయిగా నిలిచింది. ప్రజల…

Read More

పాల్గొన్న ప్రముఖ అంబేద్కర్ వాది వేల్పుల భాస్కర్ పరివర్తన అవాజ్,కొత్తగూడెం ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో లక్ష్మీదేవి పల్లి సంజయ్ నగర్ గ్రామపంచాయతీ నుండి ఉప సర్పంచ్ గా నియమితులై బాధ్యతలు చేపట్టిన వడ్డేమ్ సతీష్ కుమార్ ను మంగళవారం నాడు ఐ ఎన్ టి యు సి ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు కనకం సూరిబాబు పూలదండ శాలువాతో ఘనంగా సన్మానించారు, ఈ సందర్భంగా వారు స్పందిస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ ఆ ప్రాంత ప్రజలకు తనకు చేతనైన సహాయ సహకారాలు అందిస్తూ అందరి మనసులలో మంచివాడిగా గుర్తింపు పొందిన సతీష్ అన్నను సంజయ్ నగర్ ప్రజలు వార్డ్ మెంబర్ గా గెలిపించి ఉపసర్పంచిగా అవకాశం కల్పించటం ఎంతో సంతోషకరమని, పొంగులేటికి అత్యంత సన్నిహితుడిగా నిస్వార్థ భావజాలంతో కొనసాగుతూ అన్ని వర్గాల ప్రజలకు సమానత్వాన్ని పంచే వడ్డేమ్ సతీష్ అన్న రానున్న కాలంలో రాజకీయంగా మరెన్నో ఉన్నత పదవులు…

Read More

  సుజాతనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ఆరైవ్ అలైవ్ 2026 కార్యక్రమం ప్రారంభోత్సవం   పరివర్తన అవాజ్,కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా పది రోజుల పాటు రోడ్డు భద్రతపై అవగాహనా కార్యక్రమాలు.రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు,రవాణా,ఆరోగ్య శాఖల ఆధ్వర్యంలో అవగాహన కల్పించడం కోసం ఏర్పాటు చేసిన వినూత్న కార్యక్రమమే ఆరైవ్ అలైవ్ 2026 అని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు.రోడ్డు ప్రమాదాలను నియంత్రించడానికి ప్రజలకు అవగాహన కల్పించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆరైవ్ అలైవ్ 2026 కార్యక్రమం జిల్లాలో మంగళవారం నాడు సుజాతనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పాల్గొన్నారు. కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో సుజాతనగర్ మండల పరిసర ప్రాంతాల ప్రజలు,ప్రజా…

Read More

  మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని సర్పంచ్  బలరాం విజ్ఞప్తి   పరివర్తన అవాజ్,కొత్తగూడెం నందా తండా గ్రామపంచాయతీలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రేపు ముగ్గుల పోటీలను నిర్వహించనున్నట్లు సర్పంచ్ మాలోత్ బలరాం తెలిపారు. ఈ పోటీల్లో గ్రామానికి చెందిన మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని  విజ్ఞప్తి చేశారు. ముగ్గుల పోటీలు ఉత్సాహభరితంగా నిర్వహించబడతాయని, ప్రతిభ కనబరిచిన విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళల్లో దాగి ఉన్న కళాత్మక నైపుణ్యాలను ప్రోత్సహించడం లక్ష్యమని అన్నారు. గ్రామ ప్రజలు, మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని పెద్ద సంఖ్యలో హాజరై ముగ్గుల పోటీలను విజయవంతం చేయాలని సర్పంచ్ మాలోత్ బలరాం కోరారు.  

Read More

  జయప్రదం చేయాలి శేషగిరి నగర్‌లో వాల్ పోస్టర్ ఆవిష్కరణ   పరివర్తన ఆవాజ్,కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, లక్ష్మీదేవి పల్లి మండలం శేషగిరి నగర్ గ్రామపంచాయతీలో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) 100 సంవత్సరాల ముగింపు సభ సందర్భంగా జనవరి 18న నిర్వహించనున్న భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శేషగిరి నగర్‌లో వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీదేవి పల్లి మండల సీపీఐ కార్యదర్శి లక్ష్మీపతి, సహాయ కార్యదర్శి దారా శ్రీను, యువజన సంఘం నాయకుడు సాయి, జిల్లా కౌన్సిల్ సభ్యురాలు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కరిష రత్నకుమారి, ఉప సర్పంచ్ రామ్ రెడ్డి, వార్డు సభ్యులు ధర్మ, రాములు, గ్రామ సీపీఐ కార్యదర్శి అంబేద్కర్ పాల్గొన్నారు. అలాగే బానోత్ శాంతి, పాకాల లక్ష్మి, రేణిగుంట్ల లక్ష్మి, మదనమ్మ, కుంటి పుష్ప, రాజమణి, వెంకట నరసమ్మ, జై మునిసా తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం…

Read More