Author: laxman RAO
పరివర్తన అవాజ్,కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లకు సంబంధించిన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, డీసీసీ మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ ఖాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహమ్మద్ ఖాన్ మాట్లాడుతూ, రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మైనార్టీలకు తగిన ప్రాధాన్యం ఇచ్చి అవకాశం కల్పించాలని కోరారు. అలాగే ప్రతి డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం మైనార్టీ నాయకులు సమిష్టిగా పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఎండి కరీం పాషా, జిల్లా సెక్రటరీ గౌస్ పాషా, ఆర్గనైజేషన్ సెక్రటరీ ఇబ్రహీం, నియోజకవర్గ అధ్యక్షులు గౌస్ మొయినుద్దీన్, కొత్తగూడెం టౌన్ మైనార్టీ అధ్యక్షులు ఎండి ఖాజా బక్ష్, వర్కింగ్ ప్రెసిడెంట్ దావూద్, ఉపాధ్యక్షులు అక్బర్ భాయ్, ప్రధాన కార్యదర్శి ఖమర్ ఖాదర్, పాల్వంచ…
పరివర్తన అవాజ్,భద్రాది కొత్తగూడెం అశ్వారావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఏరుసలేం చర్చి ప్రారంభోత్సవం శుక్రవారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ చర్చిని చర్చి పాస్టర్ మాలోత్ కిరణ్ ప్రార్థనలతో అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గానుగపాడు సొసైటీ వైస్ చైర్మన్ భూపతి ధనలక్ష్మి హాజరై మాట్లాడుతూ, గ్రామంలో ఆధ్యాత్మిక కేంద్రాల ఏర్పాటు సామాజిక సమైక్యతకు దోహదపడుతుందని అన్నారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూపతి శ్రీనివాసరావు పాల్గొని, చర్చి ద్వారా సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బానోతు రాణియా నాయక్, బానోత్ లక్మ నాయక్, బానోత్ రామోజీ నాయక్, పెండ్యాల పాపారావు తదితరులు పాల్గొని నూతన చర్చి నిర్వహణకు తమ శుభాకాంక్షలు తెలిపారు. చర్చి ప్రారంభోత్సవానికి గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక ప్రార్థనల్లో…
పరివర్తన అవాజ్,కొత్తగూడెం మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వార్డులకు సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియను శనివారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి. పాటిల్ లాటరీ పద్ధతిలో నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు, నిబంధనల మేరకు పూర్తి పారదర్శకతతో ఈ ప్రక్రియను నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారుల సమక్షంలో లాటరీ ప్రక్రియ కొనసాగినట్లు తెలిపారు.కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 60 వార్డులు ఉండగా, వాటిలో షెడ్యూల్డ్ ట్రైబ్స్ (ఎస్టీ)కు 11 వార్డులు, షెడ్యూల్డ్ కాస్ట్స్ (ఎస్సీ)కు 12 వార్డులు, బ్యాక్‌వర్డ్ క్లాసెస్ (బీసీ)కు 7 వార్డులు, సాధారణ మహిళలకు 30 వార్డులు, అన్‌రిజర్వ్డ్ కేటగిరీలో 14 వార్డులు కేటాయించినట్లు తెలిపారు. *ఎస్టీ కేటగిరీ:* ఎస్టీకి కేటాయించిన 11 వార్డుల నెంబర్లు 20, 34, 9, 33, 23, 19, 3, 48,…
పరివర్తన అవాజ్,కొత్తగూడెం జిల్లా కేంద్ర గ్రంథాలయానికి విలువైన పోటీ పరీక్షల పుస్తకాలను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సెంట్రల్ ఆటో వర్క్‌షాప్‌లో సూపర్ డెండెంట్ ఇంజనీర్ డిపార్ట్మెంట్‌లో పనిచేస్తున్న ఆర్. రామ శేషయ్య విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్‌కు సంబంధించిన పుస్తకాలతో పాటు నీట్, ఐఐటీ, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలను జిల్లా గ్రంథాలయానికి అందజేశారు. పుస్తకాలను అందుకున్న అనంతరం జిల్లా గ్రంథాలయం తరఫున గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు దాత ఆర్. రామ శేషయ్యను అభినందించారు. ఇలాంటి దాతలు మరింతమంది ముందుకు వస్తే గ్రంథాలయాలను ఆశ్రయిస్తున్న పోటీ పరీక్షల విద్యార్థులకు ఎంతో లాభం చేకూరుతుందని ఆయన తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని దాతలు గ్రంథాలయాల అభివృద్ధికి సహకరించాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథపాలకురాలు జి. మణి మృదుల దాతకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు విద్యార్థులు, విద్యార్థినులు, పాఠకులు పాల్గొన్నారు.
జిల్లాలోని అన్ని ఆసుపత్రులలో ప్రసూతి సేవలు, ప్రసూతి వైద్యులనీ నియమించి జిల్లా నలుమూలల ప్రసూతి సేవలు అందిస్తున్న జిల్లా టీవీవీపీ అధికారులు ఆసుపత్రి పురోగతి పై హర్షం వ్యక్తం చేసిన ఎం ఎల్ ఏ పాయం, జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ , డీసీ హెచ్ ఎస్ డా.రవి బాబు, స్థానిక ప్రజలు* పరివర్తన అవాజ్,కొత్తగూడెం నేడు బుర్గంపాడు ఆసుపత్రి చరిత్రలో మొట్టమొదటి సీజేరియన్ (పెద్దాపెరేషన్) చేసి ఆసుపత్రి వైద్యులు చరిత్ర సృష్టించారు. సారపాక కి చెందిన బానోత్ మమత అనే 26 ఏళ్ల మహిళకి మొదటి కాన్పు సీజేరియన్ కాగా రెండో కాన్పు కోసం బుర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవo కోసం చేరగా పరీక్షించిన ప్రసూతి వైద్యురాలు డా అనూష లక్ష్మి నేడు సిజేరియన్ ఆపరేషన్ చేసి పండంటి 3 కేజీల మగబిడ్డకు పురుడుపోసారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపారు. గతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గా ఉన్న…
-లక్షలాది మందితో భారీ బహిరంగ సభ – అరుణ వర్ణంగా భద్రాద్రి జిల్లా కేంద్రం- – భారీ హోర్డింగ్లు, కటౌవుట్లు, సైన్బోర్డులు- – జిల్లా నుండి 15వేల వాహనాల్లో 70వేల మంది తరలింపు – కూనంనేని సారధ్యం, పాషా ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి పరివర్తన అవాజ్ ,కొత్తగూడెం భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) భారత గడ్డపై 100సం.లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశమే గర్వించేలా ఖమ్మం గుమ్మంలో రేపు (ఆదివారం) శత వసంత ఉత్సవాల ముగింపు సభ కనీవినీ ఎరుగని రీతిలో జరగనుంది. ఇందుకోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా హలో కామ్రేడ్ ఛలో ఖమ్మం అనే నినాదం మార్మోగుతోంది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు సారధ్యం, జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా ఆధ్వర్యంలో జిల్లాలో శత వంసత ఉత్సవాల ముగింపు సభవిజయవంతానికి పనులు పూర్తయ్యాయి. భారత స్వతంత్రాని కంటే ముందే 1925…
పోరాటాల ఖిల్లా.. ఖమ్మం సభకు కదలండి ఖమ్మం నగరాన్ని ఎర్ర సంద్రంలా మారుద్దాం పరివర్తన ఆవాజ్,కొత్తగూడెం వందేళ్ల స్పూర్తితో ప్రజాపోరాటాలకు మరింత పదును పెడదామని, ఖమ్మం నగరంలో సిపిఐ శతాబ్ది ముగింపుబహిరంగ సభను వేదికగా చేసుకునేందుకు సంసిద్ధులు కావాలని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. ఈ నెల 18న ఖమ్మం నగరంలో జరిగే శతాబ్ది ముగింపు సభను జయప్రదం చేయాలని కోరుతూ శుక్రవారం కొత్తగూడెం పట్టణపరిధిలోని వన్నందాస్ గడ్డ, పాతకొత్తగూడెం, బర్మా క్యాంపు, ప్యూన్ బస్తి, బూడిదగడ్డ, మేదరబస్తీ, ప్రగతి నగర్, లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని సీతారాంపురం గ్రామాల్లో జరిగిన ప్రచార సభల్లో అయన పాల్గొని మాట్లాడారు. దేశంలో మతోన్మాద, కార్పొరేట్ శక్తుల ఆగడాలను అడ్డుకోగల శక్తి కేవలం ఎర్రజెండాకే ఉందన్న విషయాన్ని ఈ వందేళ్ల చరిత్ర నిరూపించిందని ఆయన స్పష్టం చేశారు. ఖమ్మంలో ప్రదర్శించబోయే వేలాది మంది క్రమశిక్షణాయుత రెడ్ షర్ట్…
పరివర్తన అవాజ్,కొత్తగూడెం ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం,కార్మికుల హక్కుల కోసం, సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న సిపిఐ పార్టీ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈనెల 18వ తేదీన ఖమ్మంలో జరగనున్న భారీ బహిరంగ సభకు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్- AITUC కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య, ఉపాధ్యక్షులు కే డబ్ల్యూ కిష్టాఫర్ లు పిలుపునిచ్చారు.శుక్రవారం నాడు కొత్తగూడెం కార్పొరేట్ పరిధిలోని బిల్డింగ్ ఆఫీస్, హెడ్ ఆఫీస్, మెయిన్ వర్క్ షాప్, నర్స క్వార్టర్స్ తదితర పని ప్రదేశాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఏఐటీయూసీ, సిపిఐ ఆధ్వర్యంలో చేసిన పోరాటాల ఫలితంగా అనేక హక్కులను సాధించుకోవడం జరిగిందని,ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను హరించు వేస్తుందని విమర్శించారు.పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు పరచి పెట్టుబడిదారులకు అనుకూలంగా లేబర్…
పరివర్తన అవాజ్ ,కొత్తగూడెం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మైనారిటీ గురుకులాల అడ్మిషన్లు 2026–27 విద్యా సంవత్సరానికి గాను ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ IDOC క్యాంప్ ఆఫీస్‌లో శుక్రవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలు తమ పిల్లలను మైనార్టీ గురుకుల పాఠశాల ఐదవ తరగతి మరియు కళాశాల ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో చేర్పించాలని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెంలో బాలికలకు, బాలురకు, బూర్గంపాడు బాలికలకు, భద్రాచలం బాలురకు, అశ్వారావుపేట బాలికలకు, ఇల్లందు బాలికలకు విడివిడిగా ఐదవ తరగతి మరియు ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ముస్లిం మైనారిటీ పిల్లలను తెలంగాణ ప్రభుత్వ మైనార్టీ గురుకులాల్లో చేర్పించాలని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మైనారిటీల విద్యావకాశాల కోసం ఏర్పాటు చేసిన గురుకులాల విద్యావకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అడ్మిషన్లు ఆన్‌లైన్…
పాల్గొన్న చుంచుపల్లి సిపిఐ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తల పరివర్తన అవాజ్, కొత్తగూడెం నందా తండా గ్రామంలో మనం దినపత్రిక క్యాలెండర్–2026ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నందా తండా సిపిఐ మాజీ వార్డ్ మెంబర్ మాలోత్ మురళితో పాటు చుంచుపల్లి మండల సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాలోత్ మురళి మాట్లాడుతూ, మనం దినపత్రిక నిజాలను నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకెళ్లే పత్రికగా గుర్తింపు పొందిందని అన్నారు. ప్రజా సమస్యలు, సామాన్యుల గొంతుకను ధైర్యంగా ప్రతిబింబిస్తున్న పత్రికగా మనం దినపత్రిక నిలుస్తోందని ప్రశంసించారు. అలాగే భవిష్యత్తులోనూ మనం దినపత్రిక మరింత బాధ్యతతో మంచి వార్తలను ప్రచురిస్తూ, ప్రజల విశ్వాసాన్ని చూరగొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చుంచుపల్లి మండల సిపిఐ నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ, ప్రజల పక్షాన నిలబడి నిజాయితీగల జర్నలిజాన్ని కొనసాగిస్తున్న మనం దినపత్రికకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.…
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.