Author: laxman RAO
పాల్వంచ కేఎల్ఆర్ఇంజనీరింగ్ కళాశాలలో పాల్వంచ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏరావై ఏలైవ్ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎస్పీ పరివర్తన అవాజ్, కొత్తగూడెం రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి,ప్రజలలో ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినూత్న కార్యక్రమమే ఏరావై ఏలైవ్-2026* అని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. రోడ్డు ప్రమాదాలను నియంత్రించడానికి ప్రజలకు అవగాహన కల్పించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఏరావై ఏలైవ్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాడు పాల్వంచలోని కేఎల్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలోని విద్యార్థులకు అవగాహన కల్పించారు.పాల్వంచ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పాల్గొన్నారు.పాల్వంచ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో విద్యార్దినీ,విద్యార్థులు పాల్గొన్నారు.ముందుగా కొన్ని వీడియోలు,ప్రజెంటేషన్ ద్వారా రోడ్డు భద్రతా నియమాల గురించి విద్యార్థులకు అవగాహన…
పరివర్తన అవాజ్,కొత్తగూడెం రాబోయే కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 14వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు కాంగ్రెస్ మైనార్టీ కొత్తగూడెం టౌన్ అధ్యక్షుడు ఎండీ ఖాజా బక్ష్ తన బయోడేటా దరఖాస్తును సమర్పించారు. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్నకు నేడు బయోడేటా ఫామ్ అందజేశారు. నిరంతరం మైనార్టీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజల్లో మంచి గుర్తింపు పొందిన నాయకుడిగా ఎండీ ఖాజా బక్ష్ పేరుగాంచారు. ఇదే సందర్భంలో, 16వ డివిజన్ బీసీ మహిళకు కేటాయించబడిన నేపథ్యంలో, ముస్లిం సమాజం తరఫున తన భార్య ముబాసిన్ అంజుమ్కు 16వ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని కోరుతూ జిల్లా డీసీసీ అధ్యక్షురాలికి మరో బయోడేటా దరఖాస్తును కూడా సమర్పించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం అసెంబ్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ గౌస్ ఉద్దీన్, ఓబీసీ…
రామవరం, జనవరి 19:రాబోయే కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 14వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు కాంగ్రెస్ మైనార్టీ కొత్తగూడెం టౌన్ అధ్యక్షుడు ఎండీ ఖాజా బక్ష్ తన బయోడేటా దరఖాస్తును సమర్పించారు. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షురాలు శ్రీమతి తోట దేవి ప్రసన్నకు నేడు బయోడేటా ఫామ్ అందజేశారు. నిరంతరం మైనార్టీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజల్లో మంచి గుర్తింపు పొందిన నాయకుడిగా ఎండీ ఖాజా బక్ష్ పేరుగాంచారు. ఇదే సందర్భంలో, 16వ డివిజన్ బీసీ మహిళకు కేటాయించబడిన నేపథ్యంలో, ముస్లిం సమాజం తరఫున తన భార్య ముబాసిన్ అంజుమ్కు 16వ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని కోరుతూ జిల్లా డీసీసీ అధ్యక్షురాలికి మరో బయోడేటా దరఖాస్తును కూడా సమర్పించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం అసెంబ్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ గౌస్…
డీసీసీ అధ్యక్షురాలు తోట దేవిప్రసన్నకు దరఖాస్తు అందజేత పరివర్తన అవాజ్,కొత్తగూడెం కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 53వ డివిజన్‌కు కాంగ్రెస్ పార్టీ తరఫున కార్పొరేటర్ అభ్యర్థిగా పల్లపు వెంకటేశ్వర్లు దరఖాస్తు సమర్పించారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షురాలు తోట దేవిప్రసన్న కు ఆయన అధికారికంగా అభ్యర్థిత్వ దరఖాస్తును అందజేశారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల మధ్యకు తీసుకెళ్లడంతో పాటు, 53వ డివిజన్ పరిధిలోని మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని ఈ సందర్భంగా పల్లపు వెంకటేశ్వర్లు తెలిపారు. పార్టీ అధిష్టానం ఆమోదంతో ప్రజలకు మరింత చేరువై పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని పల్లపు వెంకటేశ్వర్లకు మద్దతు ప్రకటించారు.
పరివర్తన ఆవాజ్,కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐక్య తల్లిదండ్రుల సంఘం (UPA) ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్‌ను ఈరోజు ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు మారుతి రత్నాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల బిక్షపతి, ATEC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.సోమయ్య, తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పామర్తి అంకినీడు ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారి సమక్షంలో జిల్లా అధ్యక్షులు లోగాని శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి రుద్రోజ్ మోహన్‌లు క్యాలెండర్‌ను ఆవిష్కరించగా, అనంతరం వాటిని జిల్లా కమిటీ సభ్యులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మారుతి రత్నాకర్ మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 23 మండలాల్లో సంఘ కమిటీలను పునఃసంఘటితం చేస్తున్నామని తెలిపారు. సంఘాన్ని మరింత బలోపేతం చేయడానికి సభ్యులు కమిటీ ఎన్నికలలో చురుకుగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. సంఘం క్లబ్‌ల ద్వారా సభ్యత్వాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. జిల్లా…
శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలి జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఏర్పాటు చేసిన నేర సమీక్షా సమావేశంలో జిల్లా పోలీస్ అధికారులతో ఎస్పీ పరివర్తన అవాజ్,కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు గల కాన్ఫరెన్స్ హాల్ నందు ఎస్పీ రోహిత్ రాజు జిల్లాలోని పోలీసు అధికారులతో సోమవారం నేర సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న అధికారులతో ఎస్పీ మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులందరూ బాధ్యతగా తమ విధులు నిర్వర్తించాలని సూచించారు.ఎలాంటి ఆవాంచనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల నియమావళిని అనుసరించి పటిష్టమైన ప్రణాళికను తయారు చేసుకోవాలని సూచించారు ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్టమైన చర్యలు చేపట్టాలని కోరారు.శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై ఉక్కుపాదం మోపాలని తెలిపారు.ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు ర్యాలీలు,సభలకు అనుమతి తీసుకోవడం తప్పనిసరని,ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై చర్యలు…
పేద కుటుంబాల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా పథకాలు అమలు జరగాలి కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం క్లబ్‌లో అట్టహాసంగా రుణాల పంపిణీ కార్యక్రమం రూ. 2.88 కోట్ల మెగా చెక్కును అందించిన ఎమ్మెల్యే కూనంనేని 60 డివిజన్ల పరిధిలోని 864 గ్రూపులకు వడ్డీ లేని రుణాలు అందజేత పరివర్తన అవాజ్,కొత్తగూడెం మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించినప్పుడే సమాజం అన్నివిధాలా అభివృద్ధి సాదిస్తుందని, పేద కుటుంబాలు ఆర్ధికాభివృద్దివైపు అడుగులు వేస్తాయని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. సోమవారం కొత్తగూడెం క్లబ్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లకు చెందిన డ్వాక్రా సంఘాల మహిళలకు ఆయన వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 864 పట్టణ స్వయం సహాయక సంఘాలకు సంబంధించి రూ. 2,88,35,377ల విలువైన మెగా చెక్కును ఆయన మహిళా ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ..మహిళలు పొదుపుతో…
పరివర్తన అవాజ్,కొత్తగూడెం అన్ని గ్రామపంచాయతీల్లో తీర్మానాలు చేయాలి : డీసీసీ అధ్యక్షురాలు తోటా దేవి ప్రసన్న జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల, గ్రామస్థాయి నాయకులు, పెద్దలు, అన్ని గ్రామపంచాయతీల సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు ఈ విషయాన్ని గమనించాలని కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షురాలు తోటా దేవి ప్రసన్న ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్రంలోని బీజేపీ మోదీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలతో మహాత్మా గాంధీ పేరుతో నడుస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ, కోట్లాది మంది గ్రామీణ పేదల జీవనాధారాన్ని దెబ్బతీయాలని చూస్తోందని ఆమె తీవ్రంగా విమర్శించారు. ఈ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా, ఈ నెల 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అన్ని గ్రామపంచాయతీల్లో యథావిధిగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలంటూ తీర్మానాలు చేయాలని ఏఐసీసీ పిలుపునిచ్చిందని తెలిపారు. ఆ పిలుపులో భాగంగా తెలంగాణ పీసీసీ…
పరివర్తన అవాజ్,కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు దేవి ప్రసన్న గారిని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు దొండపాటి శ్రీనివాసరావు (వాసు), కాంగ్రెస్ పార్టీ ఓబీసీ విభాగం జిల్లా అధ్యక్షులు అల్లాడి నరసింహారావు, మిరియాల కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీని జిల్లా స్థాయిలో మరింత బలోపేతం చేయడంలో డీసీసీ అధ్యక్షులు దేవి ప్రసన్న నాయకత్వం కీలకమని ప్రశంసించారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, కాంగ్రెస్ విధానాలను బలంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. డీసీసీ అధ్యక్షులు దేవి ప్రసన్న మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అందరి సహకారం అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో…
12 కేసులు నమోదు— తూనికలు కొలతలు శాఖ అధికారి మనోహర్ పరివర్తన అవాజ్, కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో వినియోగదారుల హక్కుల పరిరక్షణలో భాగంగా, ఆదివారం తూనికలు కొలతలు శాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెం సంత ప్రాంతం, కొత్తగూడెం పట్టణం అన్నపూరెడ్డిపల్లి మండలంలోని చేపలు, చికెన్, మాంసం విక్రయ దుకాణాలపై విస్తృత స్థాయి తనిఖీలు నిర్వహించడమైందని తూనికలు కొలతలు శాఖ అధికారి కే. మనోహర్ తెలిపారు. ఈ తనిఖీలలో తూనికలు కొలతల చట్టం, సంబంధిత నిబంధనలను ఉల్లంఘిస్తూ ధృవీకరణ లేని తూకపు యంత్రాలు వినియోగించడం, సరైన ముద్రలు లేకుండా తూకాలు నిర్వహించడం, కొలతల్లో తేడాలు చూపించడం వంటి అక్రమాలు గుర్తించబడినట్లు తెలిపారు. ఈ ఉల్లంఘనలపై మొత్తం 12 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు.తూనికలు కొలతల చట్టాన్ని ఉల్లంఘించిన వ్యాపారులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని ఆయన స్పష్టం చేశారు. వినియోగదారులను మోసగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. అన్ని…
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.