Author: laxman RAO
పరివర్తన అవాజ్,కొత్తగూడెం ప్రజాస్వామ్యంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు తన ఓటు హక్కును బాధ్యతాయుతంగా, సద్వినియోగపరుచుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పిలుపునిచ్చారు. ఆదివారం జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో నూతన ఓటర్లతో నిర్వహించిన సైకిల్ ర్యాలీని కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ వద్ద జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే పాలకులను ఎన్నుకునే అత్యున్నత హక్కు ఓటు హక్కు అని అన్నారు. ప్రజల అభిప్రాయాలకు ఆమోదయోగ్యంగా, ఎక్కువమంది ఆదరణ పొందిన ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఓటు హక్కును కల్పించిందని తెలిపారు. గతంలో ఓటు హక్కు సాధన కోసం అనేక త్యాగాలు, ఉద్యమాలు, పోరాటాలు జరిగాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జాతీయ ఓటరు దినోత్సవం ప్రతి పౌరుడు ఓటు హక్కు విలువ, విశిష్టతను అవగాహన చేసుకునేందుకు,…
పరివర్తన అవాజ్,కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎస్.కె గౌస్ పాషా శుక్రవారం డిసిసి అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 39వ డివిజన్ కార్పొరేటర్‌గా మైనార్టీ కోటాలో తనకు అవకాశం కల్పించాలని గౌస్ పాషా డిసిసి అధ్యక్షురాలిని కోరారు. గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి పనిచేస్తూ, పార్టీ పిలుపు మేరకు ప్రతి కార్యక్రమంలో పాల్గొన్న తన సేవలను గుర్తించి అవకాశం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పార్టీ కోసం పని చేసిన కారణంగా గతంలో తనపై అక్రమ కేసులు పెట్టినప్పటికీ, ఎలాంటి భయపడకుండా కాంగ్రెస్ జెండాను వదలలేదని గౌస్ పాషా తెలిపారు. ఆనాటి పిసిసి అధ్యక్షులు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నానని, సభ్యత్వ నమోదు కార్యక్రమంలో…
మాలోత్ భీముడు ఎన్నికల బరిలోకి పరివర్తన అవాజ్,కొత్తగూడెం చుంచుపల్లి మండలం నందా తండా గ్రామపంచాయతీ వాస్తవ్యుడురాబోయే ఎంపీటీసీ ఎలక్షన్లో భాగంగా చుంచుపల్లి మండలం నందా తండా గ్రామపంచాయతీ నుంచిపోటీ చేయనున్నట్లు ప్రకటించారు. పేదల పక్షాన నిలబడి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, గ్రామ సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుండే వ్యక్తిగా మాలోత్ భీముడు గ్రామస్తుల మధ్య మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.విద్యావంతుడిగా, అవినీతికి దూరంగా ఉంటూ ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తున్నానని పేర్కొన్న ఆయన, గ్రామపంచాయతీలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం చూపే బాధ్యతను భుజాన వేసుకుంటానని తెలిపారు. తండా అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, యువతకు ఉపాధి అవకాశాలు, పేదల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.గ్రామ పెద్దలు, యువత, మహిళలు తనను ఆశీర్వదించి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరిన మాలోత్ భీముడు, తనకున్న మెజార్టీతో గెలిపిస్తే గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేస్తానని తెలిపారు. ప్రజల…
సర్వారం పంచాయతీలో గ్రామ సభ పరివర్తన ఆవాజ్,కొత్తగూడెం ఇంటింటికి ఉపాధి అందించలానే మంచి ఆలోచనతో సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ సారద్యంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తే పేదలకు ఉపాధిని క్రమక్రమంగా దూరం చేయాలనే దురుద్దేశంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వీబీ-జీ రామ్ జీ పథకాన్ని తక్షణమే రద్దు చేయలంటూ సుజాతనగర్ మండలం సర్వారం పంచాయతీ సర్పంచ్ భూక్యా సునీత ఆధ్వర్యంలో మాజీ ఏఎంసి చైర్మన్ భూక్యా రాంబాబు అధ్యక్షతన నిర్వహించిన గ్రామ సభలో డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీకటి కార్తీక్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు ఉపాధి హామీ చట్టం లేకపోతే బతికేదెలా అంటూ ప్రశ్నించారు. గ్రామీణ పేదలకు ”పని హక్కు” గా ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి, భధ్రత లేని వీజీ రాం జీ పథకం ఎందుకంటు…
రామవరం 6డివిషన్ల విస్తృత సమావేశం రామవరం డివిజన్లలో మరింత పట్టు సాదించాలి : సాబీర్ పాషా పరివర్తన అవాజ్,కొత్తగూడెం త్వరలో జరగనున్న కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార జోరును సిపిఐ పెంచింది. ఎన్నికలకు పార్టీ నాయకులు, కార్యకర్తలను సంసిద్ధులను చేసేందుకు జరుగుతున్న డివిజన్ల స్థాయి సమావేశాల్లో భాగంగా రామవరం పరిధిలోని ఆరు డివిజన్ల విస్తృత స్థాయి సమావేశం బుధవారం పార్టీ కార్యాలయం విఠల్ రావు మెమోరియల్ హాల్లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా పాల్గొని మాట్లాడారు. కొత్తగూడెం మున్సిపాలిటీలో అంతర్భాగంగా ఉన్న రామవరం పట్టణంలో సిపిఐకి తిరుగులేదని, అనాదిగా ఇక్కడి ప్రజలు సిపిఐని ఆదరిస్తున్నారని, ప్రజలకు సిపిఐ అందిస్తున్న సేవలే ఇందుకు కారణమన్నారు. కొత్తగూడెం పట్టణ అభివృద్ధి సిపిఐతోనే సాధ్యమని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడేది తమ పార్టీయేనని స్పష్టం చేశారు. ముఖ్యంగా రామవరం ప్రాంతంలోని డివిజన్లలో పార్టీకి…
బరిలోకి యువ నాయకుడు గుగులోత్ శ్రీకృష్ణ పరివర్తన అవాజ్,కొత్తగూడెం మంగపేట, వేపలగడ్డ, నరసింహసాగారం సహా మూడు గ్రామాలు పంచాయతీ పరిధి నుండి తాజాగా కార్పొరేషన్ లో 23వ డివిజన్ గా ఏర్పడిన తరవాత జరిగే మొదటి ఎలక్షన్ కాగా, కొత్తగూడెం కార్పొరేషన్ నేపథ్యంలో, ఆ డివిజన్ నుంచి యువకుడు గుగులోత్ శ్రీకృష్ణ పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. మంగపేట నివాసి, విద్యావంతుడు, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న సోషల్ వర్కర్ అయిన గుగులోత్ శ్రీకృష్ణ, ప్రజలకు మంచి చేసే నాయకుడిగా, అన్యాయాన్ని ప్రశ్నించే యువకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడమే తన లక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 23వ డివిజన్ ప్రజల ఆశీర్వాదంతో ఎన్నికల బరిలో నిలవడం ఖాయమని స్పష్టం చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పోటీ నుంచి వెనక్కి తగ్గేది…
పరివర్తన అవాజ్,కొత్తగూడెందివ్యాంగ ఉద్యోగ సంఘం 2026 కాలమానిని జిల్లా జడ్జి పి వసంత్ పాటిల్ మంగళవారం జిల్లా కోర్టు ఆవరణలో ఆవిష్కరించినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులకు ఏదో లోపం ఉన్నప్పటికీ వారు ఎంతో జ్ఞానము, తెలివి, మానసిక, దృఢత్వము కలిగి సమాజంలో ఉన్నత స్థితిలోకి వెళ్తూ అందరితో సమానంగా వారు జీవితాన్ని ముందుకు నడిపిస్తు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపినారు. వైకల్యాన్ని లెక్క చేయకుండా కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రతి ఉద్యోగి సమాజానికి ఆదర్శనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం బార్ అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ, దివ్యాంగ ఉద్యోగ సంఘం అధ్యక్షులు మాలోతు జగ్గుదాస్, గౌరవ అధ్యక్షులు రాము, మహిళా ప్రధాన కార్యదర్శి ఉపేంద్రమ్మ, రంజాన్ మియా, నరసింహ, రవికుమార్, బాలకృష్ణ, మేడి. ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పరివర్తన అవాజ్,కొత్తగూడెం కేంద్రంలోని బీజేపీ–మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో మహాత్మా గాంధీ పేరుతో నడుస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ కోట్లాది గ్రామీణ పేదల ఉపాధి హక్కులను హరించడానికి ప్రయత్నిస్తోందని నిరసిస్తు మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండలం, దమ్మపేట గ్రామపంచాయితీలో మండల కాంగ్రెస్ అధ్యక్షుని ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీసీసీ అధ్యక్షులు తోట దేవి ప్రసన్న, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు తోట దేవి ప్రసన్న గారు మాట్లాడుతూ,ఏఐసీసీ పిలుపు మేరకు, టీపీసీసీ నిర్ణయంతో మరియు డీసీసీ ఆదేశాల ప్రకారం ఈ నెల 20 నుంచి 30 తేదీ వరకు అన్ని గ్రామపంచాయితీలలో యథావిధిగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని, అలాగే బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన విబి…
పెండింగ్ రోడ్లు, డ్రైన్లు, కరెంటు స్తంభాల మంజూరుకు డిప్యూటీ కమిషనర్‌కు వినతిపత్రం పరివర్తన అవాజ్,కొత్తగూడెం సర్పంచ్‌లకు మంగళవారం నిర్వహించిన శిక్షణ తరగతులలో భాగంగా వెంకటేశ్వరావు కాలనీ పంచాయతీగ్రామ పంచాయతీ సర్పంచ్ తేజావత్ సరితరతన్ నాయక్ తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ ని మర్యాదపూర్వకంగా కలిసి గ్రామ సమస్యలపై వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా గ్రామంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రోడ్ల నిర్మాణ పనులు, కొత్తగా డ్రైన్ల ఏర్పాటు అవసరం, అలాగే కరెంటు స్తంభాల మంజూరు వంటి కీలక సమస్యలను డిప్యూటీ కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలు రోజువారీగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించి, గ్రామాభివృద్ధికి ఈ పనులు అత్యవసరమని ఆమె స్పష్టం చేశారు.గ్రామ అభివృద్ధి పనులపై సానుకూలంగా స్పందించి, సంబంధిత శాఖ అధికారులకు తక్షణమే అవసరమైన ఆదేశాలు జారీ చేసి పనులు వేగంగా ప్రారంభించేందుకు చొరవ చూపాలని సర్పంచ్ వినతిపత్రం ద్వారా కోరారు. గ్రామ ప్రజల తరఫున సమస్యలను ధైర్యంగా, స్పష్టంగా…
పెండింగ్ రోడ్లు, డ్రైన్లు, కరెంటు స్తంభాల మంజూరుకు డిప్యూటీ కమిషనర్‌కు వినతిపత్రం పరివర్తన అవాజ్,కొత్తగూడెం సర్పంచ్‌లకు మంగళవారం నిర్వహించిన శిక్షణ తరగతులలో భాగంగా వెంకటేశ్వరావు కాలనీ పంచాయతీగ్రామ పంచాయతీ సర్పంచ్ తేజావత్ సరితరతన్ నాయక్ తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ ని మర్యాదపూర్వకంగా కలిసి గ్రామ సమస్యలపై వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా గ్రామంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రోడ్ల నిర్మాణ పనులు, కొత్తగా డ్రైన్ల ఏర్పాటు అవసరం, అలాగే కరెంటు స్తంభాల మంజూరు వంటి కీలక సమస్యలను డిప్యూటీ కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలు రోజువారీగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించి, గ్రామాభివృద్ధికి ఈ పనులు అత్యవసరమని ఆమె స్పష్టం చేశారు.గ్రామ అభివృద్ధి పనులపై సానుకూలంగా స్పందించి, సంబంధిత శాఖ అధికారులకు తక్షణమే అవసరమైన ఆదేశాలు జారీ చేసి పనులు వేగంగా ప్రారంభించేందుకు చొరవ చూపాలని సర్పంచ్ వినతిపత్రం ద్వారా కోరారు. గ్రామ ప్రజల తరఫున సమస్యలను ధైర్యంగా, స్పష్టంగా…
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.