పరివర్తన అవాజ్,కొత్తగూడెం
పండగ సందర్బంగా పట్టణంలో రద్దీ పెరిగిన వేళ కొత్తగూడెం–విజయవాడ హైవే రోడ్డుపై ప్రమాదం చోటుచేసుకుంది. పోస్ట్ ఆఫీస్ సెంటర్ వద్ద ఉన్న BSNL కార్యాలయం ముందు ఓ లారీ అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ పైకి ఎక్కింది.
ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పండగ కారణంగా రహదారిపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం గాని, గాయాలు గాని సంభవించలేదని డ్రైవర్ తెలిపాడు.
పండగ సమయంలో వాహనదారులు మరింత జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.
