
ఉంగరం గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి
కొత్తగూడెం, పరివర్తన అవాజ్:కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో 23వ డివిజన్ కార్పొరేటర్‌గా కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గూగులోత్ విజయలక్ష్మి గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. వార్డు ప్రజల ఆశీస్సులు, మద్దతుతో విజయాన్ని సాధిస్తానని తెలిపారు.
వార్డుల అభివృద్ధి, పారదర్శక పరిపాలన, ప్రజలకు అందుబాటులో ఉండే సేవలే తన ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. అవినీతి రహిత పాలన అందిస్తూ ప్రతి కుటుంబ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ప్రజలను కలుస్తూ వార్డుల సమస్యలను తెలుసుకుంటున్న విజయలక్ష్మి, అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ వార్డును అభివృద్ధి దిశగా నడిపిస్తానని అన్నారు.
ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో ఉంగరం గుర్తు (5వ నెంబర్) పై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
