పరివర్తన అవాజ్, కొత్తగూడెం:-కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 27వ డివిజన్లో సీపీఐ పార్టీ కార్యకలాపాలు వేగవంతమవుతున్నాయి. ఈ సందర్భంగా 27వ డివిజన్ ఇన్చార్జ్లుగా ఉన్న ఎక్స్-ఎంపీటీసీ దుర్గరాశి వెంకన్న మరియు ఎక్స్-ఎంపీపీ దుర్గరాశి లక్ష్మి ఆధ్వర్యంలో ఈరోజు సీపీఐ పార్టీ రాష్ట్ర నాయకుడు ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు చేతుల మీదుగా కార్పొరేటర్ అభ్యర్థి మద్దాల హరితకు బీ-ఫారం అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ, 27వ డివిజన్ అభివృద్ధి కోసం మద్దాల హరిత కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలు అందరూ మద్దాల హరితను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అలాగే సీపీఐ పార్టీ ఎన్నికల గుర్తు అయిన కంకి-కొడవలి గుర్తుకు ఓటు వేసి విజయాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
