Saturday, September 12, 2026
Home Politics కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించాలి –

కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించాలి –

0
22
IMG-20260201-WA0984

📰 Generate e-Paper Clip

సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు రాష్ట్ర నాయకుడు ఆళ్ల మురళి పిలుపు

పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అఖండ భారీ మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు ఆళ్ల మురళి సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఈరోజు కొత్తగూడెం ఏరియా వీకేఓసీ (వీకేఓసి) లో జెట్టి మోహన్, బూరుగు సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఆళ్ల మురళి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని, రాష్ట్ర గౌరవ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (శీనన్న) జిల్లాలో ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తూ పరిష్కరిస్తున్నారని అన్నారు. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడిగా శీనన్న జిల్లాలో తనదైన ముద్ర వేసారని కొనియాడారు.

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు తరతరాలకు గుర్తుండిపోయే విధంగా ఉంటాయని, ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీకి వస్తున్న అపూర్వ స్పందనను చూసి ప్రతిపక్షాలకు నిద్ర పట్టడం లేదని వ్యాఖ్యానించారు. ఎలాంటి ఎన్నికలు జరిగినా ప్రజల తీర్పు కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా వస్తుందని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లాలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్లు చరిత్రలో నిలిచిపోతాయని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో అన్ని సీట్లను గెలిచి శీనన్నకు కానుకగా ఇవ్వాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వాడపల్లి రమేష్, నాగేందర్, నవీన్, షరీఫ్, తిరుపతి, గంగారం, పోశం, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.