
55వ డివిజన్లో బి ఆర్ ఎస్ ఎన్నికల ప్రచార హోరు…
అందరికంటే ముందంజలో ఇమంది గణేష్..
కారు గుర్తుకి ఓటేయాలని జోరుగా ప్రచారం.
పరివర్తనవాజ్, కొత్తగూడెం:-కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికలలో 55వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న ఇమంది గణేష్ ఇంటింటి ప్రచారం మంచి ఉత్సాహంగా కొనసాగింది.. ప్రచారంలో ప్రతి చోట చిన్న పెద్ద అందరూ కెసిఆర్ ప్రభుత్వ హయాంలోనే అనేక సంక్షేమ పథకాలు అందాయని మళ్లీ కెసిఆర్ ప్రభుత్వమే రావాలని కారు గుర్తుకే ఓటేస్తామని మాటిస్తున్నారు..
స్థానికంగా కూలీలైన్ 55వ డివిజన్లో పుట్టి పెరిగిన ఇమంది గణేష్ కు విశేష మద్దతు లభిస్తుంది.
స్థానికంగా నివాసం ఉంటూ అందరికీ అందుబాటులో ఉండే యువకుడు ఉన్నత విద్యావంతుడైన గణేష్ లాంటి యువ నాయకత్వం 55వ డివిజన్ కు చాలా అవసరమని ప్రజలు అంటున్నారు.
ఎప్పుడు పాతవారికి పాత పార్టీలకు కాకుండా కొత్తవారు రావాలని జనం అభిప్రాయపడుతున్నారు. ప్రచారంలో భాగంగా ప్రజలు ప్రతినిత్యం ఉండే సమస్యలను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పుకొచ్చారు. ప్రజల సమస్యలను తీర్చేందుకు తప్పనిసరిగా కృషి చేస్తానని ఇమంది గణేష్ అందరికీ హామీ ఇస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ప్రచారంలో అన్ని వర్గాల ప్రజల మద్దతు కూడగట్టుకుని గెలుపు సాధించే దిశగా ప్రచారం చేస్తున్నానని ఇమంది గణేష్ నమ్మకంతో తెలిపారు..
