
పరివర్తన ఆవాజ్ :-కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 25వ జనరల్ వార్డు నుంచి బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా కురిమెల్ల శంకరయ్య నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ ప్రక్రియ పూర్తి అయిన అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆయనకు ధృవపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా కురిమెల్ల శంకరయ్య మాట్లాడుతూ, గత 20 సంవత్సరాలుగా దేశంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ ఉద్యమ మార్గంలో పోరాటం చేస్తున్నానని తెలిపారు. బీసీలకు రాజకీయ అధికారం సాధించాలంటే బహుజన్ సమాజ్ పార్టీ ద్వారానే సాధ్యమని నమ్మి పార్టీలో చేరి, కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పారు.
స్వతంత్ర భారతదేశానికి 70 సంవత్సరాలు పూర్తయినా బీసీలకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ ప్రాతినిధ్యం లభించకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజలు తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. అగ్రవర్ణ పార్టీల ఆధిపత్యానికి గట్టి బుద్ధి చెప్పాలని పిలుపునిస్తూ, 25వ వార్డు నుంచి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఇన్చార్జి తాండ్ర వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.కురిమెల్ల శంకరయ్య
బహుజన్ సమాజ్ పార్టీ
