
పరివర్తన కొత్తగూడెం : 77 వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్తగూడెం పట్టణంలోని ప్రగతి మైదాన్ లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా యస్పి రోహిత్ రాజు చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 2025 వ సంవత్సరంలో భాధ్యతయుత ఉద్యోగ, కర్తవ్య నిర్వహణలో చేసిన అవిరళ కృషికి గుర్తింపుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు సబ్బాతి సుమిత్రా దేవి, మహమ్మద్ సాదిక్ పాషా లకు కలేక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ ఐ.ఏ.యస్. ప్రశంసా పత్రము అందజేశారు. 2021 నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ లో సుమిత్రా దేవి, సాదిక్ పాషా ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులుగా చేసిన సేవలకు గుర్తింపు గా ప్రసంసా పత్రం అందుకోవడం సంతోషంగా ఉందని ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు తెలిపారు. మరింత భాథ్యతగా జిల్లా లో బాల్య వివాహాలు అరికట్టేందుకు, బాల కార్మిక వ్యవస్థ రూపుమాపేందుకు పని చేస్తామని సుమిత్రా దేవి, మహమ్మద్ సాదిక్ పాషా తెలిపారు.
