
పరివర్తన అవాజ్:- కొత్తగూడెం కార్పొరేషన్ 14వ వార్డు సుభాష్ చంద్రబోస్ నగర్, రామవరం ప్రాంతంలోని మోడ్రన్ ఇఖ్రా స్కూల్‌లో 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందస్తు వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ షేక్ అబ్దుల్ బాసిత్ మాట్లాడుతూ, భారతదేశం ప్రపంచ దేశాలన్నింటిలో అత్యుత్తమ రాజ్యాంగం కలిగిన దేశమని అన్నారు. వివిధ కులాలు, మతాలు, భిన్న సంస్కృతులు కలిగిన ప్రజలంతా ఒక్కటిగా జీవించేందుకు సమాన హక్కులు, బాధ్యతలు కల్పించిన భారత రాజ్యాంగం ప్రతి పౌరుడు గౌరవించాల్సిన గొప్ప గ్రంథమని ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమంలో భాగంగా పాఠశాల చిన్నారులు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రాజ్యాంగ ఔన్నత్యాన్ని చాటి చెప్పే ప్రసంగాలు చేయగా, దేశభక్తి గీతాలతో సభను అలరించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు పర్వీన్ సుల్తానా, ఉపాధ్యాయులు నసరత్, శిరీషా, విజయలక్ష్మీ, నాజీయా, నీలా, సరస్వతీ, అనితా, జేఫీషా, సల్మా, సుహాన తదితరులు పాల్గొన్నారు.
Previous Articleరామవరం జామియా మసీద్ ఆవరణలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
Next Article మేడారం భక్తులకు అందుబాటులో ఆర్టీసీ సేవలు
Related Posts
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
© 2026 Parivarthana Awaaz . Designed by Creativals.com.
