
పరివర్తన అవాజ్ ,కొత్తగూడెం:- రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని కొత్తగూడెం ఎంజీ రోడ్‌లోని గణేష్ టెంపుల్ ఆలయంలో అవుటుపల్లి రాంబాబు గురుస్వామి పుట్టినరోజు వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన శిష్య బృందం, డోలక్ రంజిత్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు, పాటల కచేరి నిర్వహించారు. కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది.
అనంతరం గణేష్ టెంపుల్ ఆలయంలో మాఘమాసం మొత్తం శ్రీ సూర్యనారాయణ స్వామివారి ప్రీతికోసం భక్తులకు గోత్రనామాలతో పూజలు, సూర్య నమస్కార పూజల విధానాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. సూర్య జయంతి రథసప్తమి సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి.
పాటల కార్యక్రమంలో చదలవాడ సూరి, గాయకుడు పేర్ల సుదీర్ పాల్గొనగా, సౌండ్ సిస్టమ్‌ను జీడి విశాల్ సమకూర్చారు. దారా రమేష్‌తో పాటు భక్త బృందం, ఆలయ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
