వ్యవసాయ కార్మిక సంఘం
నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్.
కొత్తగూడెం: 2026జనవరి 23, శుక్రవారం: తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ముద్రించిన 2026 సంవత్సర క్యాలెండర్ ను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ ఆవిష్కరించారు, శుక్రవారం నాడు జిల్లా కేంద్రంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ కార్మికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక హామీలిచ్చి అమలు చేయడం లేదని విమర్శించారు, వ్యవసాయ, గ్రామీణ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు, బిజెపి ప్రభుత్వం స్విస్ బ్యాంకులో ఉన్న నల్లదనం తెచ్చి పేదలను లక్షాదికారులను చేస్తానని అనేక మాయ మాటలు చెప్పి మోసం చేసిందన్నారు, దేశంలో పేదలకు ఇంటి స్థలం, ఇల్లు మంజూరు చేయడంలో కూడా కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని అన్నారు,
మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు చేయడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు,విబి జి రామ్ జి బిల్లు రద్దు చేసి ఉంటేఊూతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు, ప్రతి సంవత్సరం వ్యవసాయ కార్మికులకు 12వేల రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఇస్తామని చెప్పి అమలు చేయడం లేదని ఆయన అన్నారు, ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు శెట్టి వినోద, జిల్లా సహాయ కార్యదర్శి ముదిగొండ రాంబాబు,చుంచుపల్లి మండల నాయకులు కోట బాలక్రిష్ణ , సిద్దెల రాములు, సోల్తి రఘు, జబ్బు సంద్య, కల్తీ భారతమ్మ, ఎండీ నసూర్, మోకాళ్ళ వెంకటేశ్వర్లు,రుహీన, రాంబాబు, గణేష్, పూజారి నాగమణి, సుజాత, తదితరులు పాల్గొన్నారు
