Monday, September 14, 2026
Home Politics మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి : డీసీసీ అధ్యక్షురాలు దేవి...

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి : డీసీసీ అధ్యక్షురాలు దేవి ప్రసన్న

0
28
IMG-20260121-WA0913

📰 Generate e-Paper Clip

సర్వారం పంచాయతీలో గ్రామ సభ

పరివర్తన ఆవాజ్,కొత్తగూడెం

ఇంటింటికి ఉపాధి అందించలానే మంచి ఆలోచనతో సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ సారద్యంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తే పేదలకు ఉపాధిని క్రమక్రమంగా దూరం చేయాలనే దురుద్దేశంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వీబీ-జీ రామ్ జీ పథకాన్ని తక్షణమే రద్దు చేయలంటూ సుజాతనగర్ మండలం సర్వారం పంచాయతీ సర్పంచ్ భూక్యా సునీత ఆధ్వర్యంలో మాజీ ఏఎంసి చైర్మన్ భూక్యా రాంబాబు అధ్యక్షతన నిర్వహించిన గ్రామ సభలో డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీకటి కార్తీక్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు ఉపాధి హామీ చట్టం లేకపోతే బతికేదెలా అంటూ ప్రశ్నించారు. గ్రామీణ పేదలకు ”పని హక్కు” గా ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి, భధ్రత లేని వీజీ రాం జీ పథకం ఎందుకంటు నిలదిశారు. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలకు, నగరాలకు వలసలు నివారించి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిని కల్పించి, గ్రామీణ పేదరికం పూర్తిగా పారద్రోలాలని గ్రామీణులకు పనిచేసే హక్కు కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిందన్నారు. ఈ పథకం అమలులోకి వచ్చిన తర్వాత చాలా మేరకు గ్రామీణ ప్రాంతాల నుండి వలసలు తగ్గిపోయాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆర్థిక భారం లేకుండా కేంద్ర ప్రభుత్వం 90 శాతం, రాష్ట్రప్రభుత్వం 10 శాతం నిధులు భరించే విధంగా ఈ పథకానికి రూపకల్పన చేసిందన్నారు. కానీ నేడు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వికసిత భారత్ గ్యారెంటీ రోజ్గార్ అజీవిక మిషన్ గ్రామీణ పథకంలో మొత్తం ఖర్చులో 60 శాతం కూలీలకు, 40 శాతం అభివృద్ధి పనులకు ఖర్చు చేసే విధంగా పథకానికి రూపకల్పన జరిగిందని వివరించారు. దీని వల్ల కొన్ని రాష్ట్రాలు ఈ పథకాన్ని కొనసాగించకపోతే పేదలకు అన్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించేలా పేదల పని హక్కును కాలరాసే జీ రాం జీ పథకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ గ్రామ సభలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.