
పరివర్తన అవాజ్,కొత్తగూడెం
దివ్యాంగ ఉద్యోగ సంఘం 2026 కాలమానిని జిల్లా జడ్జి పి వసంత్ పాటిల్ మంగళవారం జిల్లా కోర్టు ఆవరణలో ఆవిష్కరించినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులకు ఏదో లోపం ఉన్నప్పటికీ వారు ఎంతో జ్ఞానము, తెలివి, మానసిక, దృఢత్వము కలిగి సమాజంలో ఉన్నత స్థితిలోకి వెళ్తూ అందరితో సమానంగా వారు జీవితాన్ని ముందుకు నడిపిస్తు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపినారు. వైకల్యాన్ని లెక్క చేయకుండా కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రతి ఉద్యోగి సమాజానికి ఆదర్శనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం బార్ అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ, దివ్యాంగ ఉద్యోగ సంఘం అధ్యక్షులు మాలోతు జగ్గుదాస్, గౌరవ అధ్యక్షులు రాము, మహిళా ప్రధాన కార్యదర్శి ఉపేంద్రమ్మ, రంజాన్ మియా, నరసింహ, రవికుమార్, బాలకృష్ణ, మేడి. ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
