Monday, September 14, 2026
Home Politics కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిరసన

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిరసన

0
48
IMG-20260120-WA0336-1

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్,కొత్తగూడెం

కేంద్రంలోని బీజేపీ–మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో మహాత్మా గాంధీ పేరుతో నడుస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ కోట్లాది గ్రామీణ పేదల ఉపాధి హక్కులను హరించడానికి ప్రయత్నిస్తోందని నిరసిస్తు మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండలం, దమ్మపేట గ్రామపంచాయితీలో మండల కాంగ్రెస్ అధ్యక్షుని ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీసీసీ అధ్యక్షులు తోట దేవి ప్రసన్న, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు తోట దేవి ప్రసన్న గారు మాట్లాడుతూ,
ఏఐసీసీ పిలుపు మేరకు, టీపీసీసీ నిర్ణయంతో మరియు డీసీసీ ఆదేశాల ప్రకారం ఈ నెల 20 నుంచి 30 తేదీ వరకు అన్ని గ్రామపంచాయితీలలో యథావిధిగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని, అలాగే బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన విబి జీ రాంజీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ ప్రతి గ్రామపంచాయితీలో తీర్మానాలు చేయాలని పిలుపునిచ్చారు. 2005 సంవత్సరంలో సోనియా గాంధీ, డా. మన్మోహన్ సింగ్, పేద ప్రజలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకువచ్చారని, కానీ నేడు మోడీ ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వీర్యం చేసి పేదల హక్కులను కాలరాస్తోందని తీవ్రంగా ఖండించారు. మోడీ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. అశ్వరావుపేట నియోజకవర్గ శాసన సభ్యులు జారే ఆదినారాయణ మాట్లాడుతూ
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం తీసుకువచ్చిన ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ప్రజల హక్కులను హరించే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అందువల్ల ప్రతి గ్రామపంచాయితీ నుంచి తీర్మానాలు స్వీకరించనున్నట్లు తెలియజేస్తూ, సర్పంచులు, వార్డు సభ్యులు అందరూ ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నూతన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామ శాఖ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.