
పరివర్తన అవాజ్,కొత్తగూడెం
రాబోయే కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 14వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు కాంగ్రెస్ మైనార్టీ కొత్తగూడెం టౌన్ అధ్యక్షుడు ఎండీ ఖాజా బక్ష్ తన బయోడేటా దరఖాస్తును సమర్పించారు. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్నకు నేడు బయోడేటా ఫామ్ అందజేశారు.
నిరంతరం మైనార్టీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజల్లో మంచి గుర్తింపు పొందిన నాయకుడిగా ఎండీ ఖాజా బక్ష్ పేరుగాంచారు. ఇదే సందర్భంలో, 16వ డివిజన్ బీసీ మహిళకు కేటాయించబడిన నేపథ్యంలో, ముస్లిం సమాజం తరఫున తన భార్య ముబాసిన్ అంజుమ్‌కు 16వ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని కోరుతూ జిల్లా డీసీసీ అధ్యక్షురాలికి మరో బయోడేటా దరఖాస్తును కూడా సమర్పించారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం అసెంబ్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ గౌస్ ఉద్దీన్, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు అల్లాడి నరసింహారావు, మైనార్టీ కొత్తగూడెం వైస్ ప్రెసిడెంట్ ఎండీ అక్బర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండీ దావూద్, మైనార్టీ యువజన నాయకుడు ఎండీ రహీంతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి మైనార్టీలు, బీసీలు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారూ
