డీసీసీ అధ్యక్షురాలు తోట దేవిప్రసన్నకు దరఖాస్తు అందజేత
పరివర్తన అవాజ్,కొత్తగూడెం
కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 53వ డివిజన్‌కు కాంగ్రెస్ పార్టీ తరఫున కార్పొరేటర్ అభ్యర్థిగా పల్లపు వెంకటేశ్వర్లు దరఖాస్తు సమర్పించారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షురాలు తోట దేవిప్రసన్న కు ఆయన అధికారికంగా అభ్యర్థిత్వ దరఖాస్తును అందజేశారు.
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల మధ్యకు తీసుకెళ్లడంతో పాటు, 53వ డివిజన్ పరిధిలోని మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని ఈ సందర్భంగా పల్లపు వెంకటేశ్వర్లు తెలిపారు. పార్టీ అధిష్టానం ఆమోదంతో ప్రజలకు మరింత చేరువై పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని పల్లపు వెంకటేశ్వర్లకు మద్దతు ప్రకటించారు.

