
పరివర్తన అవాజ్,కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు దేవి ప్రసన్న గారిని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు దొండపాటి శ్రీనివాసరావు (వాసు), కాంగ్రెస్ పార్టీ ఓబీసీ విభాగం జిల్లా అధ్యక్షులు అల్లాడి నరసింహారావు, మిరియాల కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీని జిల్లా స్థాయిలో మరింత బలోపేతం చేయడంలో డీసీసీ అధ్యక్షులు దేవి ప్రసన్న నాయకత్వం కీలకమని ప్రశంసించారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, కాంగ్రెస్ విధానాలను బలంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
డీసీసీ అధ్యక్షులు దేవి ప్రసన్న మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అందరి సహకారం అవసరమని తెలిపారు.
ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో స్నేహపూర్వకంగా సాగింది.
